• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్రపై కొవిడ్...

మహారాష్ట్రపై కొవిడ్ పంజా.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

By - Tupaki Desk
Update: 2021-04-06 03:25 GMT
మహారాష్ట్రలో కొవిడ్ తన విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనే మహారాష్ట్రలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.  కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో గరిష్ఠ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అనగా 24 గంటల్లో 47,288 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరో 155 మంది మృత్యువాత పడినట్లు నివేదికలో వెల్లడించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,51,375 క్రియాశీల కేసులున్నట్లు ఈ మేరకు మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ను సోమవారం రాత్రి విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో మరో 26,252 మంది వైరస్ నుంచి విముక్తి పొందినట్లు తెలిపింది. మొత్తం 25,49,075 మంది వైరస్ నుంచి కోలుకున్నారని నివేదికలో పొందుపర్చారు. ఆ రాష్ట్రంలో మొత్తం 30,57,885 కరోనా కేసులు నమోదుకాగా.. 56,033మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. ఎక్కువగా ముంబై నగరంలో కొవిడ్ వ్యాపిస్తోంది.

కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.  ముందు నుంచి ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకున్నా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.   ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నారు. అయినా మహరాష్ట్రపై కొవిడ్ పంజా విసురుతూనే ఉంది. కేంద్రం కూడా ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి తగ్గించడానికి  ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
Tags:    
  • Dangerous Disease In Maharashtra 
  • Maharashtra Marriage 
  • 47 
  • 000 Corona Case 
  • Telugu News 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS