• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 24 గురువారం 2019...

జనవరి 24 గురువారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-24 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో కలహాలు, అనుకోని ఖర్చులుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు తారుమారవుతాయి. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులు, రాజకీయ వర్గాల వారికి విమర్శలు తప్పవు. ఐటీ ఉద్యోగులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు ప్రోత్సాహం కనిపించదు. మహిళలకు మానసిక అశాంతి. శ్రీరామ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగ యత్నాలు వాయిదా పడుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వారు కొంత ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ ఉద్యోగులకు చికాకులు. విద్యార్థులు ఫలితాలు సాధించడంలో నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో కొన్ని సమస్యలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి పెరుగుతుంది. ఆప్తుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు. వ్యాపారాల్లో పురోగతి. ఐటీ ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు శుభ సమాచారం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి: శుభవార్తలు వింటారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి శుభ సమాచారం. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. కళాకారులు - రాజకీయ రంగాల వారికి అవకాశాలు కలిసి వస్తాయి. ఐటీ ఉద్యోగులకు శుభ సమాచారం అందుతుంది. విద్యార్థులకు శుభ సమాచారం. మహిళలకు మానసిన అశాంతి. గాయత్రీదేవీ ధ్యానం చేయడం మంచిది.

సింహ రాశి: విలువైన వస్తువులను సేకరిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అవకాశాలు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారవృద్ధి, ఉద్యోగాల్లో ముందుడు వేస్తారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీ ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: వ్యవహారాల్లో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. అనుకోని చికాకులు ఎదురవుతాయి. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక - కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు చికాకులు. మహిళలకు నిరాశాజనకం. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూసంబంధ విషయాల నుంచి గట్టెక్కుతారు. అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి పురస్కారాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు సన్మానాలు. మహిళలకు కీలక విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.  అనుకోని ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. భాగస్వామ్య వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రాబడి నిరుత్సాహంగా ఉంటుంది. ప్రయాణాలు మధ్యలో వాయిదా పడుతాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు చేస్తారు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ నిపుణులకు ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

మకర రాశి: పలుకుబడి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకం. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఐటీ ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు శుభ సమాచారం. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు చేతికందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు. మహిళలకు శుభ సమాచారం. కనకధార స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. బంధువర్గంలో మాటపట్టింపులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆస్తి విషయంలో ఆగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ ఉద్యోగులకు ఆకస్మిక మార్పులుంటాయి. విద్యార్థులు శ్రమిస్తే ఫలితం ఉంటుంది. మహిళలకు మానసిక అశాంతి. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.


Full View
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

కోస్తా మీద పడగ విప్పనున్న అక్వాన్

2026-11-16 19:30 GMT

అప్పుడేమో ‘వందే భారత్’.. ఇప్పుడేమో ‘బ్రేక్‌లు భారత్’

2026-11-16 19:30 GMT

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

2026-11-16 19:13 GMT

మేయర్లు జెడ్పీ చైర్మన్ల వేతనం ఎంతో తెలుసా ?

2026-11-16 19:13 GMT

వృద్ధ భారతం... దక్షిణాదికే భారం

2026-11-16 19:13 GMT

'సెల్ఫీ' లీడర్లపై జగన్ సీరియస్.. 60-70 మంది ఇంచార్జుల మార్పు!?

2026-11-16 19:13 GMT

ఇంచార్జిలకు జగన్ మార్క్ బిగ్ షాక్ ?

2026-11-16 19:12 GMT

ట్రెండీ టాక్: బాబు స‌మ‌క్షంలో మెగా బ్ర‌ద‌ర్స్‌ మాస్టర్ క్లాసులు!

2026-11-16 19:11 GMT

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

2026-11-16 19:11 GMT

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

2026-11-16 19:08 GMT

అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం

2026-11-16 19:07 GMT

Copyright @2026

Powered by Blink CMS