• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 10 సోమవారం 2018...

డిసెంబరు 10 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-10 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు కలిసిరావు. రుణయత్నాలు సాగిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వాహనాల విషయంలో మెలకువలు పాటించాలి. కాంట్రాక్టులు చేజారవచ్చు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. పారిశ్రామిక వేత్తలు - కళాకారుల అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. కాంట్రాక్టులు చేజారవచ్చు. మహిళలు కొంత నిరాశ చెందుతారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి:  ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయ వేత్తలు - కళాకారులకు చిక్కులు. బంధుగణంతో విరోధాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలు. పనులు మందగిస్తాయి. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వినాయకుడిని పూజించడం మంచిది.

మిథున రాశి: రాబడి పెరిగి అవకాశాలు తీరతాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో ప్రవేశం. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
 
కర్కాటక రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రగతి కనిపిస్తుంది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి విజయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులు మరింత లబ్ది పొందుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

సింహ రాశి: బంధువర్గంతో విభేదాలు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. కాంట్రాక్టర్లకు టెండర్లలో అసంతృప్తి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ, పరిశోధన రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ రంగం వారికి శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలు కుటుంబ విషయాల్లో నిరుత్సాహం చెందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి: కుటుంబంలో చికాకులు. వ్యవహారాల్లో ఆటంకాలు. ఇంటర్వూలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహరాలు నత్తనడకన సాగుతాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత నిరుత్సాహం. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు అనారోగ్య సూచనలు. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి విముక్తి. వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయ వేత్తలకు ప్రోత్సాకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలు ఉల్లాసంగా గడుపుతారు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకలు. వ్యయప్రయసాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగవర్గాలకు అదనపు బాధ్యతలు. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాలవారి విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆకస్మిక దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహా యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు తథ్యం. ఉద్యోగవర్గాలకు పదోన్నతి సూచనలు. రాజకీయ రంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి అపవాదులు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆరోగ్యభంగం. దుర్గామాతకు కుంకుమార్చన చేయిస్తే మంచిది.

కుంభరాశి: విలువైన వస్తువులు కొంటారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. రాజకీయ వర్గాల వారికి కలిసి వచ్చే కాలం. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ఆనందదాయకంగా ఉంటుంది. శివాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సోదరులు,  సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. వేంకటేశ్వరస్వామికి అర్చన చేయించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS