• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 15 గురువారం 2018...

నవంబర్ 15 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-15 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక, వస్తు లాభాలు. ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు. వ్యాపార అభివృద్ధి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఐటీ నిపుణులు విదేశీ పర్యటనలు జరుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. శివ పంచాక్షరి పఠిస్తే మంచిది.

వృషభరాశి: ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు కలిసిరావు. ఆర్థిక ఇబ్బందులు. శారీరక రుగ్మతలు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలలో ఆటుపొట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు ఫలితాలపై అసంతృప్తి. ఐటీ నిపుణులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో సమస్యలు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

మిథున రాశి: బంధుమిత్రులతో కలహాలు. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. స్థిరాస్థి వివాదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. వ్యాపారాలలో నిదానం అవసరం. రాజకీయ, సినీ రంగాల వారికి నిరాశ. ఉద్యోగులకు స్థాన మార్పులు. ఐటీ నిపుణులు అనుకున్న  విజయాలు సాధిస్తారు. మహిళలకు ఆస్థిలాభం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటక రాశి: బంధువర్గంతో విభేదాలు తొలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగ యత్నాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. ఐటీ నిపుణులకు ఊహించని విజయాలు లభిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. రామరక్షా స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి: ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులు. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఐటీ నిపుణులు గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు నూతన  ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గణేశాష్టకం పఠించండి.

కన్యారాశి: దూర ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆశించిన స్థాయిలో పనులు ముందుకెళ్లవు. బంధువులతో విరోధాలు ఏర్పడుతాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు ఎదువుతాయి. ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ఐటీ నిపుణులకు  ఒత్తిడులు. పారిశ్రామిక - కళారంగాల వారికి శ్రమ అధికం. మహిళలకు ఆస్తి వివాదాలు. అంజనేయ దండకం పఠించండి.

తులారాశి: ఒక సమాచారం నిరుత్సానికి గురిచేస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.మిత్రులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనులలో ఒత్తిడులు. ఐటీ నిపుణులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కలుగుతుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక ఆందోళన. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కొన్ని సమస్యలు ఎదురువుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది..

వృశ్చిక రాశి: కొన్ని బాకీలు వసూలవుతాయి.. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరం. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడులు తొలుగుతాయి. మహిళలకు ఆస్థిలాభం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

ధనస్సు రాశి: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలు చేజారి పోతాయి. బంధువులతో మాటపడతారు. రుణ ఒత్తిడులు. ఉద్యోగులకు శ్రమ కలుగుతుంది. ఐటీ నిపుణులకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాలు సామన్యంగా ఉంటాయి. విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. పారిశ్రామిక - కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఒత్తిడులు ఉంటాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకర రాశి: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలను చాకచాక్యంగా పరిష్కరించుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాధరణ పెరుగుతుంది. ఐటీ ఉద్యోగులు నూతన విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకెళుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. చంద్రగ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభరాశి: దూరప్రయాణాలు ఉండవచ్చు. వ్యవహారాలు నిదానంగా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో మార్పులు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు మానసిక అశాంతి కలుగుతుంది. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మీనరాశి: నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. నూతన ఉద్యోగ యోగం. వ్యాపారులకు పట్టిందల్లా బంగారమే. రాజకీయ, కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు  కార్యసిద్ధి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.  శ్రీరామ స్తోత్రాలు పఠించండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS