• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 26 బుధవారం...

సెప్టెంబర్ 26 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-26 01:38 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: ఖర్చులు అధికమవుతాయి. లక్ష్యసాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పందాలు - పోటీలు - అంచనాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగాలు. విదేశీయానం - రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ - పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఈ రోజు ధనం బాగా ఖర్చు చేస్తారు.

వృషభరాశి: సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం అందుకుంటారు.  డైటింగ్, యోగధ్యానాలపై దృష్టి పెడతారు. గత అనుభవంతో వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పనులు సమీక్షించుకుంటారు.  ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఆదాయాభివృద్ధి - మానసిక ప్రశాంతత - సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు. పనులు సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రమోషన్స్ పొందుతారు. 

మిథునరాశి: ప్రతిఫలం అందుకుంటారు. స్నేహ - సంబంధాలు వికసిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వ్యవహారా ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. దూరప్రయాణాలతో కలిసి వస్తుంది.

కర్కాటకరాశి: పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు - బదిలీలు - మార్పులకు అనుకూల సమయం. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలు - రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు సాహస ప్రయత్నాలు విరమించండి. వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు  ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడినా సత్ఫలితాలుంటాయి.

సింహరాశి: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చర్చల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కళలు, సాహిత్యం, ప్రణాళికలు టూరిజం రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. ప్రణాళిక బద్దంగా వ్యవహరించి సాధిస్తారు. ఆదాయ - వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు - నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభిస్తాయి.  బీమా - గ్రాట్యూటీ - పెన్షన్ వ్యవహారాలకు అనుకూలం. గృహనిర్మాణ పనులు ప్రారంభంలో మందగించినా క్రమేణా వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. దూరప్రయాణం తలపెడతారు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.

తులరాశి: బ్యాంకులు - న్యాయ - వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు. అంచనాలు లాభిస్తాయి.  దుబారా ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు - విశ్రాంతి లోపం.. ఉద్యోగ - విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.

వృశ్చికరాశి: వృత్తి - వ్యాపార విషయాలను సమీక్షించుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. సహోద్యోగుల అంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. ఇంజనీరింగ్ - శాస్త్ర - సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మార్పులు - చేర్పులు - మరమ్మతులకు అనుకూలం.

ధనస్సురాశి:  విద్య - క్రీడలు - బ్యాంకుల రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. ఖర్చులు అధికం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు - పొదుపు పథకాలు లాభిస్తాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు - దూరప్రయాణాల్లో మెళకువ వహించండి.

మకరరాశి: చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. బదిలీలు - మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు - స్థలం మార్పు విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. కోళ్ల - మత్స్య - గొర్రెల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆర్థిక విషయాల్లో తొందర వద్దు. కూరగాయలు - కొబ్బరి - పండ్దు వ్యాపారులకు కలిసి వస్తుంది.

కుంభరాశి:  విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. కీలక సందేశాలు అందుకుంటారు. స్టేషనరీ - రవాణా - ఏజెన్సీ - రక్షణ న్యాయ - బోధన - పర్యాటక రంగాల వారికి శుభప్రదం. వాహన సౌకర్యం కలుగుతుంది. ప్రతిభకు నిదానంగా గుర్తింపు. సంతానంతో ఓర్పు - నేర్పు చాలా అవసరం.

మీనరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. షాపింగ్ - క్రయవిక్రయాలకు అనుకూలం. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. కృషికి కుటుంబ సభ్యుల తోడ్పాటునందుతుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురినిస్తాయి. వ్యవహారాలతో సంతృప్తి కనబడదు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS