• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 25 మంగళవారం...

సెప్టెంబర్ 25 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-25 02:11 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు - పందాల్లో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. న్యాయవివాదాల్లో ప్రత్యర్థులపై విజయం వరిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. పలుకుబడితో లబ్ధి. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం అందుతుంది. రవాణా రంగాల్లోని వారికి సంతృప్తి.

వృషభరాశి: రాజకీయ సినీ రంగాల వారికి శుభప్రదం. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. విరామ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లలో జాప్యం. స్థిరాస్థి విక్రయంలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. సభలు - సమావేశాల్లో కీలకపాత్ర. పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో జాగ్రత్త. సంతానంతో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడి - చికాకులు.

కర్కాటకరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారుల్లో ప్రోత్సాహకరం. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. పత్రిక - ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి  - పండ్లు - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంత మంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

సింహరాశి: కుటుంబంలో శుభపరిణామాలు. వాహనయోగం ఉంది. కమ్యూనికేషన్లు - న్యాయ - రక్షణ - బోధన - ఆడిటింగ్ - ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధువుల అండ లభిస్తుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు పెరుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు. రుణం తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి: మెడికల్ క్లెయిముల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. పన్నులు - బీమా పథకాల చెల్లింపులకు నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. ముక్కుసూటి తనం వివాదాస్పదమవుతుంది.

తులరాశి: బ్యాంకులు - న్యాయ - వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. అంచనాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివారలకు శుభదాయకం. ప్రయాణాల్లో చికాకులు. పరిచయాలు ఉన్నతికి ఉపకరిస్తాయి. ఫీడర్లకు - ప్లీడరు గుమస్తాలకు చికాకులు. హామీలు - చెక్కుల జారీలో జాగ్రత్త.

వృశ్చికరాశి: యోగ - ధ్యానాల మీద దృష్టిపెడతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. పరిశ్రమలు - వ్యవసాయం. ఉద్యోగ - వ్యాపార రంగాల వారికి శుభప్రదం. ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ అవసరం. పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు వేస్తారు.ఉద్యోగులు జాగ్రత్త. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ధనురాశి: వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. చిట్ ఫండ్ లు - పొదుపు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విదేశీయానంలో ఆటంకాలు. నష్టాన్ని పూడ్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలక విషయాల్లో పట్టుసాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ - గృహనిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు. ఉన్నతాధికారుల వైఖరిలో మార్పును గమనిస్తారు. డబ్బుకు  సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త. తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు రిప్రెజెంటీటివ్ లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.

కుంభరాశి: కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు. వాహనాల కొనుగోలుకు అనుకూలం. ప్రయాణాలు - చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు అదనపు సంపాదన. పుణ్యాకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనరాశి: విరాళాలు - ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. పన్నులు - బీమాలు చెల్లించేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. వాహనాల విషయంలో ఇబ్బందులు. సామూహిక సేవా కార్యక్రమాలు చేస్తారు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS