• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 22 శనివారం...

సెప్టెంబర్ 22 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-22 01:43 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అంచనాలు అందుకుంటారు. స్నేహబంధాలు బలపడతాయి. పెట్టుబడులు లాభం తెస్తాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొంటారు.  మీ పలుకుబడితో కొందరు లబ్ధిపొందుతారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కలుగుతుంది. రవాణా రంగాల్లో వారికి సంతృప్తిగా ఉంటుంది.స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.

వృషభరాశి: పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వైద్యం - హోటల్ - పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం. పై అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపార వర్గాల మాటతీరు - స్కీములు కొనుగోలు దారులకు ఆకట్టుకుంటాయి. మోసపోయే అవకాశం ఉంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లలో శ్రమాధిక్యత - ప్రయాసలు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగలకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: సన్నిహితుల నుంచి సమచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరం. పొదుపు పథకాలు - పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు.  పెద్ద మొత్తంలో ధన సహాయం చేయవద్దు. సంతానంతో చికాకులు. ఉద్యోగులుకు ఒత్తిడి - చికాకులు.

కర్కాటకరాశి: ఆర్థిక విషయాల్లో మీ వైఖరి సమీక్షించుకుంటారు. గృహనిర్మాణం - రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  పత్రిక - ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి - పండ్ల - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. విశ్రాంతి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

సింహరాశి: ప్రత్యర్థులపై విజయం. కొత్త స్నేహాలు - పరిచయాలు కలుగుతాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. రాజకీయాల్లోని వారికి వారి ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమికులకు ఆంక్షలు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. రుణ తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి: ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆస్పత్రులు - హోటల్ - ఔషధ రంగాల వారు లాభాలు ఆర్జిస్తారు.  పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువై ఫలితాలు రావు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధువులతో సంబంధాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ సంపాదనపై ఆసక్తి కలుగుతుంది. అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ముక్కుసూటి తనం గొడవలకు దారితీస్తోంది.

తులరాశి: కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి పెడతారు. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం. బంగారం - వెండి - లోహ పని వాళ్లకు శుభదాయకం. ప్రయాణాల్లో చికాకులు - అసౌకర్యం. పరిచయాలు ఉన్నతిని పెంచుతాయి. ఫీడర్లకు - ఫీడర్ గుమస్తాలకు చికాకులు. హామీలు - చెక్కుల జారీలో జాగ్రత్త.

వృశ్చికరాశి: బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. నిత్యావసరాలు - నిర్మాణం - రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. వైద్యపరీక్షలు చేయించుకోండి.

ధనురాశి: పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంకల్పం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు.వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. స్తిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.  వృత్తి - ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు - ప్రమోషన్లకు అవకాశం ఉంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. మాటలు పడుతారు. తప్పులు పునరావృతం చేయొద్దు. స్కీములతో జాగ్రత్త.  తేలికగా మోసపోతారు. ఉపాధ్యాయులకు - రిప్రెజెంటీవీలకు ఒత్తిడి - చికాకులు తప్పవు.

కుంభరాశి: విదేశీ  ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు.లక్ష్య సాధనకు కొత్త పథకాలు రూపొందిస్తారు. పుణ్యాకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వాహనాలతో జాగ్రత్త.

మీనరాశి: ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఉన్నతవిద్య, విదేశీ వ్యవహారాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ప్రముఖుల పరిచయాలు అనుకూలిస్తాయి. వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామూహిక సేవా కార్యక్రమాలతో పేరొస్తుంది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS