• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 17 సోమవారం...

సెప్టెంబర్ 17 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-17 01:44 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   ప్రయాణాలతో ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. వృత్తి - వ్యాపారాల్లో అంచనాలు అందుకునేందుకు అధికంగా శ్రమించాలి. రక్షణ - న్యాయ - బోధన - రవాణా రంగాల వారికి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. తెలివితేటలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో కాస్త జాగ్రత్త. డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది.

వృషభరాశి: ఖర్చులు - అంచనాలు మించిపోతాయి.షాపింగ్ లో నాణ్యత గమనించాలి. బ్యాంకు లావాదేవీలు కొలిక్కి రావడం కష్టం. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీపై తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. అపోహలను నమ్మకండి. ఉద్యోగంలో మీ ప్రతిభకు లోటు ఉండదు. ఇంటా - బయటా సామాన్యంగా పరిస్థితులు ఉంటాయి.

మిథునం : పందాలు - పోటీలకు వాగ్వాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితుల నుంచి మాట పడాల్సి వస్తుంది. సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. ఇంటికోసం ఖర్చులు అధికం. భార్య/భర్త వైఖరితో మనస్తాపం కలుగుతుంది. గుండె - శ్వాసకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్యభంగం. స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి.

కర్కాటకం : సహోద్యోగుల కారణంగా మాట పడాల్సి వస్తుంది. విందుల్లో పరిమితి పాటించాలి. వృత్తి - వ్యాపారాలకు  సంబంధించిన సమాచారం కలవరపెడుతుంది. ఇంటర్వ్యూల్లో ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంత నిరంతర శ్రమను పడుతారు. నలుగురితో కలిసిపోయే తత్వం, అమితమైన తెలివితేటల వల్ల ప్రగతిని సాధిస్తారు. ఇతరులకు సహాయపడతారు.

సింహరాశి: చిన్నారులు - ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. చిట్ ఫండ్ - సేవింగ్స్ పథకాల విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది. ఆభరణాలు కొంటారు. పాత మొండి బాకీలు - మీకు రావాలసిన డబ్బు అందుతుంది.

కన్యరాశి: రియల్ ఎస్టేట్ రంగంలోని వారు నిదానం పాటించాలి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గృహనిర్మాణం - స్థల సేకరణ విషయంలో కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. బదిలీలు - మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మార్పులుండవు. డబ్బులు ఖర్చు అవుతాయి. పనుల్లో నైపుణ్యం లేకపోతే నష్టం వస్తుంది. అనవసర విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.

తుల రాశి: ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. సోదరీ - సోదరుల వైఖరి ఆవేదన. అడ్మిషన్ల విషయంలో నిరాశ తప్పకపోవచ్చు. ప్రయాణాలు - చర్చల్లో నిదానం అవసరం. విద్యార్థులు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి.  ఆర్థికంగా బలపడతారు. ముందుచూపుతో వ్యవహరించాలి. డబ్బుపై ఎవరిని నమ్మకుండా సొంతంగా చూసుకుంటే మంచిది.

వృశ్చిక రాశి:ఆర్థిక విషయాల్లో ప్రియమైన వారి వైఖరితో మనస్థాపం చెందుతారు. వస్తువులు కొని మోసపోతారు. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. పెట్టుబడులపై ఆశించిన ప్రతిఫలం రాకపోవచ్చు. ఆర్థికంగా లాభపడతారు. ఇల్లు మార్పు సూచనలు. మీకు ఆప్తులు - నచ్చని వారు - మంచి సూచనలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం.

ధనురాశి: పై అధికారులు - పెద్దలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. శ్రమాధిక్యం తప్పకపోవచ్చు.  వృత్తి - వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోతారు. గౌరవ - మర్యాదలకు భంగం కలుగుతుంది.  పట్టింపులు - కోపతాపాలు పక్కనపెడతారు. అందరితో సఖ్యత అవసరం.  వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి. మీ మాటపై నిలబడితే మంచిది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు.

మకరరాశి: ప్రయాణాలు - చర్చల్లో నిదానం అవసరం. ఒక సమాచారం కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. సినీ - రాజకీయ రంగాల వారికి ఆశాభంగం తప్పకపోవచ్చు. ఉన్నత విద్యా - విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో నిరాశ ఎదురవుతుంది. నమ్మిన వారి చేతిలో మోసపోతారు. పనుల్లో ఏకాగ్రతతో శుభఫలితాలు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అప్పుల్లో కొంత వసూలు అవుతుంది.

కుంభరాశి: పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వస్తువులు కొని మోసపోతారు. ఖర్చులు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. దైవ చింతన ఎక్కువవుతుంది. దూరపు బంధువుల నుంచి అశుభ వార్త వింటారు. కొంత ప్రతికూలత ఎదురవుతుంది. చేసే పనుల్లో జాప్యం.

మీనరాశి: గౌరవ - మర్యాదలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. పై అధికారులతో సమావేశాలు ఫలించకపోవచ్చు. ఉన్నత పదవుల విషయంలో నిరాశ తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి.  అవివాహితులకు వివాహ ప్రాప్తి. మాటపై నిలబడిన వ్యవహారం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS