• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 6 గురువారం...

సెప్టెంబర్ 6 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-06 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
 
మేషరాశి:  రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్థులకు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఓ మంచి వార్త వినపడుతుంది. రవాణా రంగాల్లో ఉన్న వారికి సంతృప్తిగా గడుస్తుంది.

వృషభరాశి: స్టేషనరీ - రవాణా, సెల్ ఫోన్లు, ఏజెన్సీ రంగాల వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది. ప్రయాణాలు ఉల్లాసాన్ని ఇస్తాయి. వాహనాల కొనుగోలు అనుకూలం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార వర్గాలకు కలిసి వస్తుంది.

మిథునరాశి: స్థలం కొనుగోలుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విలువైన వస్తువులు కొంటారు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పెద్దమొత్తంలో ధనసహాయం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులకు కలిసివస్తుంది. ఉద్యోగస్థులపై పై అధికారుల నుంచి ఒత్తిడి,చికాకులు ఎదుర్కొంటారు.

కర్కాటకరాశి: మార్కెటింగ్, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. విద్యార్థులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వీధి వ్యాపారులున్న వారికి జోరుగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది.

సింహరాశి: టెక్స్ టైల్, టెలివిజన్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు అందుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమిస్తున్న వారి నుంచి వ్యతిరేకత వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. యూనియన్లు, సహకార సంఘాలకు సంబంధించిన విషయాల్లో ఓ నిర్ణయానికి వస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.  బంధువులతో గొడవలు సర్ధుకుంటాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పై ఆసక్తి కలుగుతుంది. ముక్కుసూటి ధోరణి వివాదాస్పదమవుతుంది.

తులారాశి: రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల వారిని కలుసుకుంటారు. ప్రముఖులతో సమావేశాలు, ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యసాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. వస్త్ర , బంగారం, వెండి, లోహ పనివారలకు శుభదాయకం. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నతిని పెంచుతాయి.

వృశ్చికరాశి: బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. పదిమందిలో మీ మాట చెల్లుబాటవుతుంది. సంకల్పం నెరవేరుతుంది. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్థులు అధికారులతో జాగ్రత్తతో మాట్లాడడం మంచిది. బంధువులను కలుసుకుంటారు.

ధనురాశి: పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. పూర్వ అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. నష్టాలను పూడ్చుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలక విషయాల్లో పట్టు సాధిస్తారు. స్థిరాస్తి, క్రయవిక్రయాల్లో పునరాలోచలన అవసరం..

మకరరాశి: అనుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. పందేలు, పోటీలు, న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తారు. డబ్బుకు సంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. నోరుజారితే దెబ్బతింటారు. తప్పులు పునరావృతం చేయొద్దు. తేలికగా మోసపోయే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి,చికాకులు తప్పవు.

కుంభరాశి: ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. హోటల్ - పరిశ్రమలు - కన్సల్టెన్సీ రంగాల వారికి శుభప్రదం. ఆస్పత్రులు - వైద్య పరీక్షలకు ఖర్చు చేస్తారు. స్త్రీలకు అదనపు సంపాదన పై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.

మీనరాశి: పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుతుతంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. వాహనాలు నడిపితే ప్రమాదం. పాత మిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు వస్తాయి. అన్ని విషయాలు పట్టించుకోవద్దు.. సామూహిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS