• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 18 మంగళవారం...

సెప్టెంబర్ 18 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-18 01:38 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారు పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ - వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యారంగంలోని వారికి అధిక శ్రమ ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదుతో ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. అవగాహన లోపంతో చికాకులు. నూతన వ్యాపారాలు - ప్రాజెక్టులు - భాగస్వామిక వ్యవహారాలు కలిసిరావు. అవసరాలకు కావలసిన ధనం  సమయానికి అందుతుంది. పశు - పక్షాదులకు సేవ చేస్తే శుభ ఫలితాలు.

వృషభరాశి: ప్రకటనలు, ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. సమావేశాలు, వేడుకల్లో ప్రియమైన వారిని కలుసుకుంటారు. ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే ఫలితాలు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు.  ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. పావురాలకు జొన్నలు వేస్తే శుభఫలితాలు. ఉద్యోగులు సమర్థత వల్ల వారి సహోద్యుగులు లబ్ధి పొందుతారు. వాణిజ్య వ్యవహారాలు - ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

మిథునం: తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సంస్మరణల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గృహరుణాలు మంజూరవుతాయి. ఇంజనీరింగ్ - మెడికల్ విద్యార్థులకు ఏకాగ్రత పట్టుదల ముఖ్యం. ఒక సిరాస్థి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. చేతివృత్తుల వారికి ప్రజాసంబంధాలు మెరుగై కొత్త అవకాశాలొస్తాయి. ఆంజనేయ స్వామి గుడిలో శనగ గుగ్గిలాలను పంచితే శుభ ఫలితాలు.

కర్కాటకరాశి:  కాంట్రాక్టులు లభిస్తాయి. రిజిస్ట్రేషన్లకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు  - చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. బ్యాంకు పనుల్లో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయ రంగంలోని వారికి అభిప్రాయబేధాలుంటాయి జాగ్రత్త వహించండి. విద్యార్థులు లక్ష్య సాధనకు బాగా శ్రమించాలి. పారిశ్రామికవేత్తలు - ఇసుక - కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా లోటు లేకున్నా అసంతృప్తి వెంటాడుతుంది. అనాథ బాలలకు పండ్లు స్వీట్లు ఇప్పిస్తే శుభ ఫలితాలు.

సింహరాశి: వైద్య చికిత్సలకు నిధులు సర్దుబాటవుతాయి. విందు, వినోదాల కోసం ఖర్చు చేస్తారు. సహోద్యోగుల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత అప్పులు తీరుస్తారు. గృహనిర్మాణాలు - మరమ్మతులు మార్పు - చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి ఉంటుంది. పనిభారం అధికం. నవగ్రహ మండప ప్రదక్షిణలు చేయండి. కుక్కలకు ఏదైనా ఆహారాన్ని అందించాలి.

కన్యరాశి: ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల విషయంలో శుభ పరిణామాలు. సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులకు బదిలీలకు ఆస్కారం. ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. అన్ని చోట్ల మీ ఆధిక్యత ప్రదర్శించడం మంచిది కాదు. రుణాల ఒత్తిడి ఉంటుంది. ఏ పనిని మొదలు పెట్టిన సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. గణపతికి గరికతో అభిషేకం చేస్తే మంచింది.

తులరాశి: కుటుంబ సభ్యులతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. వేడుకలు - శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువం అవసరం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆంజనేయ స్వామి గుడిలో శనగ గుగ్గిలంతో నైవేద్యంపెట్టి పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి.

వృశ్చికరాశి: విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు సహకరిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. సోదరీ - సోదరులు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులుంటాయి. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. అతివాదన పనికి రాదు. వస్త్ర వ్యాపారులు జాగ్రత్త పాటించాలి. పేదలకు దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు.

ధనురాశి: ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు అనుకూలం సమయం. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి - వ్యాపారాల్లో అదనపు ఆదాయం సమకూరుతుంది. అనుమానాలు - అపోహలు వీడి ఆత్మవిశ్వాసం వస్తుంది. దుబారా ఖర్చులు చేస్తారు. కొబ్బరి - పండ్లు - పూల వ్యాపారులకు లాభదాయకం. దూరప్రయాణాలు మంచిది కాదు. రోజూ విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే శుభ ఫలితాలు.

మకరరాశి: కళలు - ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. సమావేశాలు - ప్రదర్శనల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం. స్తబ్దత తొలిగి మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆత్మీయులతో విభేదాలు కాస్త జాగ్రత్త వహించండి. కీలకమైన ఒప్పందాలు - ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయాల వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూల్లో నిరాశ. ఆవులకు పచ్చగడ్డిని తినిపిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

కుంభరాశి: పెట్టుబడులకు సంబంధించిన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.పూర్వానుభవంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు - ప్రదర్శనలు - సంస్మరణల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో - ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు మాట జారవద్దు. రావిచెట్టు ప్రదక్షిణ చేస్తే మంచిది. శక్తికొలది దానధర్మాలు చేస్తే శుభఫలితాలు.

మీనరాశి: ఆర్థిక సంస్థలు - బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారులకు బకాయిల వసూళ్లలో జాగ్రత్త. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు. హోటల్ - కేటరింగ్ - మార్కెటింగ్ రంగాల వారికి ఇబ్బందులు. ఆవులకు గోధుమపిండి బెల్లాన్ని ఆహారంగా అందిస్తే శుభఫలితాలు అందుతాయి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS