టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం పొందిన టీమిండియాపై, లాస్ట్ ఓవర్ వేసిన మహ్మద్ షమీపై నెటిజన్లు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు అయితే అసభ్యకర బూతులు తిడుతుతున్నారు. మరికొందరు దుర్మార్గులు విరాట్ కోహ్లీ కూతురుపై కూడా నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, షమీకి అండగా నిలిచారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాసటగా నిలిచాడు. కోహ్లీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ట్విట్టర్ లో స్పందించారు. ‘డియర్ విరాట్.. కొందరు మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును కాపాడుకో’ అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అభం శుభం తెలియని చిన్నారి వామికను టార్గెట్ చేస్తూ కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆటగాళ్లు రాణించకపోతే వారి కుటుంబ సభ్యులను దూషించడం.. వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలబడడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
ఇక ఇదే అంశంపై తాజాగా మహిళా కమీషన్ ఇవాళ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పురోగతిపై ఆరాతీసింది. నిందితులను త్వరలోనే పట్టుకోవాలని ఆదేశించింది. కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్టు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటో కేసు నమోదైంది.