బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం: నారాయణ
అప్పట్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోకుంటే చెవి/ముక్కు కోసుకుంటానని సీపీఐ నారాయణ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ‘ఆ సీపీఐ నారాయణ ఏదో కోసుకుంటానన్నాడు.. జర ఆయనను ఏది కోసుకోమనకుర్రి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో మాటల తూటాలు, పరుషమైన మాటలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పెట్టింది పేరు. ఆయన కేసీఆర్, జగన్, చంద్రబాబు ఇలా ఎవరిపైనైనా విరుచుకుపడుతుంటారు. ఈ ముగ్గురుతో రాష్ట్రానికి నష్టం నష్టం జరుగుతోందని తాజాగా ఆడిపోసుకున్నారు..
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు సీపీఐ నారాయణ. పవన్ కళ్యాణ్ మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని సెటైర్లు వేశారు.
గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు.
రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు.
బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాయనే భయం జగన్ లో ఉందని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు ఎక్కువమంది ఎంపీలున్నా చేతులెత్తేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు. జగన్, చంద్రబాబులు మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.