ఒమిక్రాన్​ తో ఆగిన పెళ్లి.. వర్చువల్​ వివాహానికి ఓకే చెప్పిన కోర్టు!

Update: 2021-12-25 00:30 GMT
కరోనా వైరస్​ వల్ల ప్రపంచం కొత్త నడకను నేర్చుకుంది అని చెప్పాలి. దీని కారణంగానే తన అవసరాలను తీర్చుకునే దానికి మనిషి కొత్త దారులను వెతికాడు. జీవితాన్ని తిరిగి సాధారణంగా మార్చుకునేందుకు వివిధ పద్ధతులను తనకు అనుకూలంగా చేసుకున్నాడు. వాటిలో ముఖ్యమైంది వర్క్​. పని విషయంలో ముందడుగు వేసి వర్క్​ ఫ్రం హోం ఆప్షన్​ ను ఎంచుకున్నాడు.

ఇదిలా ఉంటే మిగిలిన జీవితంలోని పనులు కూడా అదే బాట పట్టించాడు. ఈ వైరస్​ కారణంగా ఒకరిని ఒకరు కలిసే ప్రమేయం లేకుండా అన్నీ వర్చువల్ గా కానిచ్చేయడం ప్రారంభించాడు. ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు అయితే పంతులు పెట్టిన ముహుర్తాలకు వర్చువల్​ విధానంలోనే అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ పతకాలకు నాంది పలుకుతున్నారు.

ఈ క్రమంలోనే నెట్టింట పెళ్లిల్లు కూడా జరుగుతున్నాయి. మునిపటిలా కాకుండా ఇప్పుడు హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్​ గా పెళ్లి కానిచ్చేయోచ్చు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు పెళ్లికి అమ్మాయి అబ్బాయి లేకపోయినా పెళ్లి చేసేయోచ్చని కేరళలోని హైకోర్టు చెప్పింది.

ఇంతకీ ఎం జరిగిందంటే.. బ్రిటన్​ లో కరోనా ఆంక్షలను తీవ్రతరం చేశారు. దీంతో కేరళలో జరగాల్సిన ఆ పెళ్లికి వరుడు అనంత కృష్ణన్​ నాయర్​ రాలేక పోయాడు. దీంతో అంతా పెళ్లి ఆగిపోతుందని భావించారు. దీంతో రింటు థామస్​ అనే లాయర్​ కేరళ హైకోర్ట్ ను ఆశ్రయించారు. తమ పెళ్లి ఆన్ లైన్లో చేసుకోవాలి అనుకుంటున్నాం.. కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు.

దీనిపై వాదనలు విన్న ధర్మాసనం వారి పెళ్లికి అనుమతి ఇచ్చింది. ముందుగా అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరిగేలా తీర్పు చెప్పారు. వైరస్​ వ్యాప్తి మన దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్ లైన్​ పెళ్లికి అనుమతుల ఇచ్చాయని అదే నిర్ణయం ఈ కేసులో కూడా వర్తిస్తుందని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది.

కోర్టు ఇచ్చిన తీర్పుతో పెళ్లి బృందం ఆనందం వ్యక్తం చేసింది. అనుకున్న డేట్​ కు, అనుకున్న టైంకు పెళ్లి జరిగేలా తగిన ఏర్పాట్లను చేశారు పెళ్లి పెద్దలు. దీంతో వర్చువల్​ గా జరగనున్న ఈ పెళ్లికి తగిన ఏర్పాట్లును పరిశీలించాలని కోర్టు అందుకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేశాయి. ఈ నేపథ్యంలో వివాహాలు ఆన్ లైన్​ లోనే జరుపుకోవడాని అనుమలు ఇచ్చాయి పలు ప్రభుత్వాలు. కాకపోతే వీటికి కూడా పెద్ద సంఖ్యలో కాకుండా.. తక్కువమందితో జరిపించుకునేలా ఆదేశాల్లో పేర్కొన్నాయి ప్రభుత్వాలు.




Tags:    

Similar News