• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా అనుమానంతో దంపతుల...

కరోనా అనుమానంతో దంపతుల ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు?

By - Tupaki Desk
Update: 2020-03-27 14:00 GMT
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. లాక్ డౌన్ తరువాత కూడా కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండటం తో అందరిలో ఒకరకమైన ఆ భద్రతా భావం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు.

ఇంటికి సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృత దేహాలు ఉండటం కలకలం రేగింది. రాజమండ్రి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే రమేష్, వెంకట లక్ష్మి దంపతులు సగం కాలిన దేహాలతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు . సంఘటనా స్థలం లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. . అయితే.. కరోనా వచ్చిందన్న అనుమానంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సూసైడ్ నోట్‌లో రాసి ఉండటాన్ని బట్టి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ఇక స్థానికుల కథనం ప్రకారం వారికి చాలా కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని , వారు ఏ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలీదని అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒక బ్యాగ్ లో వారికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు దొరికాయి. అలాగే సూసైడ్ నోట్ కూడా దొరికింది. వీరిని చంపేసి, కిరోసిన్ పోసి కాల్చేసి.. సూసైడ్ నోట్ రాసిపెట్టారా? లేక వాళ్లే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • rajamundry 
  • couple 
  • suicide 
  • AP 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS