కరోనాతో లెక్కలేనన్ని మానసిక సమస్యలు ..నివారణోపాయాలివే..

Update: 2020-10-10 16:31 GMT
కరోనా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి దేశాలు,   ప్రజల ఆర్థిక పరిస్థితులే కాదు. మానసిక పరిస్థితులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎంతో మంది మహమ్మారి తెచ్చిన  ఆర్థిక సంక్షోభంతో తమ ఉద్యోగాలు పోగుట్టుకున్నారు. ఇలాంటి వారిలో ఇక జీవనం ఎలా అనే నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. కరోనా వ్యాప్తి మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారితీసింది. చాలామంది ప్రజలు  ఈ ఆందోళనను ఎదుర్కొంటున్నారు. కరోనా తో వచ్చిన సమస్యలు ఎదుర్కోలేక ఎంతోమంది డ్రగ్స్ అడిక్టులుగా మారారు. మద్యానికి బానిసలు  అయిన వారు కూడా ఉన్నారు. లేని పోని భయాలతో ఏమవుతుందోనన్న టెన్షన్ తో ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు.మధుమేహం,  బీపీ, గుండె సంబంధిత వంటి వ్యాధులు ఉన్నవారికి  కరోనా వస్తే తీవ్ర దుష్ఫలితాలు చూపుతుందనే ప్రచారం ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది ఇతర వ్యాధులు ఉన్నవారు వైరస్ బారిన పడితే.. వైరస్ తీవ్రతతో  ఏమవుతుందోనన్న భయాందళోనతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వ్యాధి బారిన పడితే చికిత్స కోసం రూ.లక్షలు పెట్టాల్సి వస్తోంది. వ్యాధి తమ ఇంట్లో వారికి వస్తే పరిస్థితి ఏమిటనే వత్తిడి చాలా మందిలో ఉంది.

కరోనా మనిషి ఆరోగ్యంపై మానసిక ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యయనాల్లో  పరిశోధకులు హెచ్చరించారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. కరోనా వల్ల మనిషిలో భయం,  అనిశ్చితి, ఒత్తిడి,  చిరాకు, తినడంలో, నిద్ర పోవడంలో మార్పులు రావడం మానసిక ఆరోగ్యం క్షీణీస్తోంది.. అనేదానికి హెచ్చరికలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాల ద్వారా చాలా మందిలో మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కరోనాతో ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరైతే.. పని గంటలు తగ్గడం, జీతం తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి ఆందోళనలు పెంచాయి. అయితే ఈ మానసిక సమస్యలను కాస్త అయినా ధైర్యంగా ఎదుర్కొంటే ఈ పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మానసిక సమస్యలకు ఇలా చెక్ పెట్టండి...

* రోజంతా ఉత్సాహంగా.. చురుగ్గా ఉండే ప్రయత్నం చేయండి

* అయిన వాళ్లు చెంత ఉంటే ఎవరికైనా కొండంత బలమే.  వారితో సన్నిహితంగా మెలగండి. మీ సమస్యలను పంచుకోండి.

* మొహమాటాన్ని వీడి ఏం సాయం కావాలన్న ఇతరులను అడగండి. సమస్య నుంచి బయట పడండి.

* జీవితంలో పనులు చేసి చేసి అలసి పోయి ఉంటే కాస్త విరామం ఇవ్వండి.

* సమయానికి భోజనంతో పాటు నీరు తగినంత తీసుకోండి.

* సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టండి.

* రోజులో కాసేపైనా తగినంత వ్యాయామం చేయండి.

* ఆలోచనలు తగ్గించుకుని పనుల్లో నిమగ్నమవ్వండి.
Tags:    

Similar News