అవినీతి మీద ఎంత ప్రాక్టికల్ గా మాట్లాడాడో

Update: 2017-02-19 04:54 GMT
కొంతమంది రాజకీయ నేతల వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరేం అనుకుంటారన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ఏమనుకుంటే దాన్నేచెప్పేస్తారు. చుట్టూ ఉన్న వారు ఆమోదిస్తారా? లేదా? అలాంటివి అస్సలు పట్టించుకోరు. ఎవరో కోసం అస్సలు బతకన్నట్లుగా వ్యవహరిస్తారు. తాము చెప్పే మాటలు వివాదం అవుతాయని తెలిసినా కేర్ చేయరు.

ఇంత ఓపెన్ గా మాట్లాడే ఎమ్మెల్యేల తీరు.. వారిని వార్తల్లో ఉంచేలా చేస్తుంది. వారిపై చర్చ జరిగేలా చేసినా.. వారు వెనక్కి తగ్గరు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కె.వెంకటేశ వ్యవహారాన్నే చూడండి. ఆయనకు ఫ్రాంక్ నెస్ ఎక్కువ. విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఫీల్ అవ్వరు. తాను చెప్పే మాటలు విమర్శలు వెల్లువెత్తేలా చేస్తాయని తెలిసినా పట్టించుకోరు.

నాయకుల అవినీతి గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎంత ఓపెన్ గా మాట్లాడేశాడన్న రీతిలో ఆయన మాటలు ఉండటం గమనార్హం. కర్ణాటక రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. నేతల్లో అవినీతి గురించి మాట్లాడటం అనవసరమని తేల్చేశారు. ఎందుకిలా అంటే.. ఆయన చెప్పే లాజిక్ వింటే.. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారన్న భావన కలగటం ఖాయం.

ఇంతకీ.. సదరు ఎమ్మెల్యే ఎం చెప్పారంటారా? అక్కడికే వస్తున్నాం. ఆయన మాటల్ని యథాతధంగా చూస్తే.. ‘‘ప్రజాప్రతినిధుల్లో అవినీతి ఎక్కువైందని అంతా అంటుంటారు. కానీ.. అవినీతికి పాల్పడకుంటే ఎన్నికల సమయంలో ఓట్లు అడగటానికి వెళ్లినప్పుడు ఓటర్లకు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చివ్వాలి?’’ అంటూ సూటిగా అడిగిన వైనం చూస్తే కాస్తంత ముచ్చట పడాల్సిందే. విషయం ఎలాంటిదైనా.. ఆయన ఫ్రాంక్ నెస్ నచ్చేయక మానదు. ఏమంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News