బ్రేకింగ్ : కరోనా పాజిటివ్ .. ఆరు జిల్లాల్లో పర్యటించిన ఇటాలియన్ దంపతులు !
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ తరువాత చైనా నుండి పలు దేశాలకి విస్తరించి ..ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా విస్తరిస్తుంది. గత రెండు రోజులుగా భారత్ లో కూడా కరోనా అనుమానిత కేసులు ఎక్కువై పోతున్నాయి. దీనితో దేశంలోని ప్రజలందరు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా భాదితులు ..కరోనా వచ్చిన విషయం తెలియక , ఆరు జిల్లాలలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు దిక్కుతోచక యుద్ద ప్రాతిపాదికన వారు పర్యటించిన ప్రాంతాలలో కరోనా చెకప్ లు ప్రారంభించారు.
ఇటలీ దేశం నుంచి ఓ జంటతోపాటు 21 మంది సభ్యులు భారతదేశ పర్యటన కోసం ఈ నెల 21వతేదీన ఢిల్లీకి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఇటాలియన్ దంపతులు రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లాలోని మండ్వా నగరానికి వచ్చి స్థానిక ట్రావెల్ ఏజెంటు ఏర్పాటు చేసిన బస్సులో పర్యటించారు.ఈ నెల 22వతేదీన బికనేర్ వచ్చి అక్కడి నుంచి జైసల్మేర్ నగరంలో పర్యటించారు. ఈ నెల 25వతేదీన జైసల్మేర్ నుంచి జోధ్ పూర్ వచ్చి అక్కడి నుంచి ఉదయపూర్ నగరానికి వెళ్లి అక్కడ రెండు రోజులు నివాసమున్నారు. ఫిబ్రవరి 28వతేదీన శ్వాసకోస సమస్యలతో ఇటాలియన్ దంపతులు జైపూర్ లోని ఫోర్టీస్ ఆసుపత్రి లో చేరారు. వారిని పరీక్షించిన వైద్యులు , వారికి కరోనా సోకినట్టు గుర్తించి ఎస్ ఎం ఎస్ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డు కు తరలించి చికిత్స చేస్తున్నారు
ఇటాలియన్ దంపతులకు మొదట చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగిటివ్ అని రాగ, ఆ తరువాత మంగళవారం సాయంత్రం జరిపిన పరీక్షల్లో వీరికి కొవిడ్-19 సోకిందని తేలింది. కరోనా వైరస్ సోకిన ఇటాలియన్ దంపతులు పర్యటించిన మండ్వా, బికనేర్, జైసల్మేర్, జోద్ పూర్, ఉదయపూర్, జైపూర్ నగరాల్లోని ప్రజలను కరోనా వైరస్ అనుమానం తో వైద్యాధికారులు పరీక్షిస్తున్నారు. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన ఇటాలియన్ దంపతులు మండ్వా నగరంలోని ఓ హోటల్ లో బస చేశారని, అలాగే ఆ చుట్టు పక్కల జిల్లాలలో పర్యటించారని వార్తలు రావడం తో అక్కడి ప్రజలు షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యం లో జైపూర్ పర్యటనకి వచ్చిన 52 మంది విదేశీ పర్యాటకుల రక్త నమూనాలను, కరోనా నిర్దారణ పరీక్షల కోసం పూణే లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ వైరాలజీ కి పంపించామని వైద్య ఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.