కర్ఫ్యూ ఉల్లంఘన.. రోడ్డుపైకొచ్చిన 400 మంది అరెస్ట్
కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డెక్కిన పాపానికి 400 మంది కటకటాల పాలయ్యారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారంతా నిత్యవసర సరుకులు, పాలు, పండ్లు, కూరగాయల కోసం 400మంది రోడ్డెక్కగా.. వారందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఈ షాకింగ్ సంఘటన జరిగింది మన దేశంలో కాదు.. జోర్డాన్ దేశంలో పోలీసులు ఈ కఠిన చర్య తీసుకున్నారు.
కరోనా వ్యాప్తి జోర్డాన్ దేశంలో ప్రబలింది. దాదాపు 85 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఏకంగా కర్ఫ్యూ విధించింది. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని ఆదేశించింది. అయితే నిత్యావసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కిన 400మంది ప్రజలను అరెస్ట్ చేశారు.
ఇప్పటికే కరోనా కారణంగా జోర్డాన్ దేశం మొత్తం మూతపడింది. అన్ని రకాల వ్యాపారాలు మూసివేశారు. మాల్స్, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు మూసివేశారు. కరోనా బాధితుల కోసం 34 హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. కరోనా కట్టడికి జోర్డాన్ సర్కార్ ఏకంగా కర్ఫ్యూ విధించింది.
మార్చి నెలలో జోర్డాన్ దేశంలో చలివాతావరణం ఉంటుంది.ఇది కరోనా వ్యాప్తికి అనుకూలం. అందుకే తాజాగా కర్ఫ్యూ విధించారు. ఆహారం, నిత్యావసరాల కోసం మార్చి 24న నూతన విధానం ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు ప్రజలు బయటకు రావద్దని కోరారు. నగరాలు, ప్రధాన హైవేలపై సైనికులను వేల సంఖ్యలో మోహరించి కరోనా వ్యాప్తిని అరికడుతున్నారు. ఎవరినీ బయటకు రానీయడం లేదు. దీంతో జనాలు ఆహారం కోసం అష్టకష్టాలు పడుతున్నారు.