కరోనా చైనాలో పుట్టలేదు.. మొదట మేం గుర్తించామంతే!

Update: 2020-10-10 03:30 GMT
కరోనా వైరస్​ చైనాలోని వూహాన్​ పట్టణంలో పుట్టిందని, అక్కడి వైరాలజీ ల్యాబ్​ లేదా మాంసపు దుకాణాల్లో ఈ వైరస్​ పుట్టిందని ప్రపంచదేశాలన్నీ బలంగా నమ్ముతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి కరోనా వైరస్​ను తయారు చేసిందే చైనా అని ఆరోపించారు. అక్కడి గబ్బిలాలు, ఇతర పక్షుల వల్ల కరోనా మనుషులకు వ్యాపించిఉండొచ్చన్న వాదనలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అయితే కరోనా పేరు ఎత్తితేనే మండిపడతాడు. అది చైనా వైరస్​ అంటూ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించాడు కూడా. అయితే ఈ విషయంపై తాజాగా చైనా స్పందించింది. కరోనా వైరస్​కు తమకు ఏ సంబంధం లేదని చెబుతోంది ‘ కరోనా వైరస్​ చైనాలో పుట్టలేదు. గత సంవత్సరం వివిధ దేశాల్లోని ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడ్డారు. అయితే మా దేశ డాక్టర్లు మాత్రం ఇది ఒక అంటువ్యాధిని గుర్తించారు. తొలుత కరోనా వైరస్​ గురించి ప్రపంచానికి చెప్పింది చైనా. అంత మాత్రం చేత ఈ వైరస్​ చైనాలో పుట్టిందన్ని ఆరోపణలు చేయడం సరికాదు.

ఈ వైరస్​ వూహాన్​ పుట్టిందనడం, గబ్బిలాలు, మాంగోలిన్​ నుంచి కరోనా వచ్చిందనడం అర్థరహితం. మేము కొన్ని కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనాను అరికట్టగలిగాం. మిగతా దేశాలు కరోనాను కంట్రోల్​ చేయలేక మామీద ఆరోపణలు చేయడం సరికాదు’ అంటూ చైనా వివరణ ఇచ్చింది. చైనా ప్రకటనపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి. మొత్తానికి కరోనా పుట్టినిల్లు అయిన చైనా ముందు వైరస్ తీవ్రతపై ప్రపంచ దేశాలకు చెప్పకుండా దాచింది.  వ్యాధి అన్ని దేశాలకు ప్రబలడానికి కారణమైంది.  ఇప్పుడు అసలు కరోనా మా దేశంలో పుట్టలేదంటూ బుకాయిస్తోంది.
Tags:    

Similar News