• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రపంచ సంచలన ఆసుపత్రి...

ప్రపంచ సంచలన ఆసుపత్రి తాజా ఆప్డేట్ తెలిస్తే అవాక్కే

By - Tupaki Desk
Update: 2020-04-16 03:15 GMT
వెయ్యి పడకల ఆసుపత్రిని కేవలం పది రోజుల్లో నిర్మించటమే కాదు.. కరోనా వైరస్ బాధితులకు వైద్య సాయం అందించిన వైనం తెలిసిందే. యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటమే కాదు.. ఇలాంటి అద్భుతాలు కేవలం చైనాలోనే సాధ్యమని నిరూపించారు. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న కరోనా వేళ.. దాని పుట్టినిల్లు అయిన వూహాన్ లో వేలాది మంది ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

అంతకంతకూ పెరిగిపోతున్న రోగుల తాకిడికి తగ్గట్లు.. రికార్డు సమయంలో కేవలం పది రోజుల వ్యవధిలో వెయ్యి బెడ్లున్న ఆసుపత్రిని సిద్ధం చేయటం ప్రపంచ వ్యాప్తంగా అందరూ చైనా వైపు చూడటమే కాదు.. వావ్.. అమేజింగ్ అన్న మాట అందరి నోటా వచ్చింది. సంక్షోభ సమయాల్లో ఇలా వ్యవహరించటం చైనాకు మాత్రమే సాధ్యమన్న భావన వ్యక్తమైంది.

తాజాగా కరోనా ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయిన వేళ.. రికార్డు వ్యవధిలో నిర్మించిన వూహాన్ ఆసుపత్రిని ఏం చేశారు? అన్న డౌట్ రాక మానదు. బుధవారం సదరు ఆసుపత్రిని క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిపోవటంతో సదరు ఆసుపత్రి అవసరం లేదని తేల్చిన ప్రభుత్వం.. దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో పని చేసే సిబ్బందిని వారి స్వస్థలాలకు పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మానవ అద్భుతానికి నిలువెత్తు రూపంగా ఉన్న ఆసుపత్రి రానున్న రోజుల్లో మాయం కానుంది. ప్రాక్టికల్ గా వ్యవహరిచటంపై ఎవరెన్ని చెప్పినా.. చైనా ప్రభుత్వం మాదిరి ఆలోచించటం మాత్రం ఎవరికీ సాధ్యం కాదన్నది వూహాన్ ఆసుపత్రి ఎపిసోడ్ లో  స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    
  • Corona Virus In China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

కోస్తా మీద పడగ విప్పనున్న అక్వాన్

2026-11-16 19:30 GMT

అప్పుడేమో ‘వందే భారత్’.. ఇప్పుడేమో ‘బ్రేక్‌లు భారత్’

2026-11-16 19:30 GMT

రాముడు కాదు కృష్ణుడు...యూపీ కోసం బీజేపీ కొత్త అస్త్రం !

2026-11-16 19:13 GMT

మేయర్లు జెడ్పీ చైర్మన్ల వేతనం ఎంతో తెలుసా ?

2026-11-16 19:13 GMT

వృద్ధ భారతం... దక్షిణాదికే భారం

2026-11-16 19:13 GMT

'సెల్ఫీ' లీడర్లపై జగన్ సీరియస్.. 60-70 మంది ఇంచార్జుల మార్పు!?

2026-11-16 19:13 GMT

ఇంచార్జిలకు జగన్ మార్క్ బిగ్ షాక్ ?

2026-11-16 19:12 GMT

ట్రెండీ టాక్: బాబు స‌మ‌క్షంలో మెగా బ్ర‌ద‌ర్స్‌ మాస్టర్ క్లాసులు!

2026-11-16 19:11 GMT

నదిని వదలను...ఆసుపత్రి నుంచే బిట్టూ పట్టు !

2026-11-16 19:11 GMT

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

2026-11-16 19:08 GMT

అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం

2026-11-16 19:07 GMT

Copyright @2026

Powered by Blink CMS