కామారెడ్డిలో కరోనా కలకలం.. ఇప్పుడెక్కడ ఉన్నాడు?
కరోనా కలకలం ఇప్పుడు దేశంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలటం ఒక ఎత్తు అయితే.. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐటీ ఉద్యోగి ఒకరు. విదేశాలకు వెళ్లి వచ్చిన అతగాడు కరోనా బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే.. తాజాగా కామారెడ్డి కి చెందిన యాభై ఏళ్ల రాజయ్య అనే వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించినట్లుగా చెబుతుననారు.
ఆయనకున్న తాజా అనారోగ్య పరిస్థితులు కరోనా లక్షణాలతో పోలి ఉండటం తో అతడ్ని తొలుత కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని గాంధీకి తరలించారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలోని వ్యక్తికి కరోనా అవకాశం ఎలా? అన్న డౌట్ అక్కర్లేదు.
ఇప్పటివరకూ కరోనా బాధితుల హిస్టరీ మాదిరే.. కామారెడ్డి వ్యక్తిది కూడా. ఇటీవల అతగాడు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి.. కామారెడ్డికి చేరుకున్నాడు. పది రోజుల క్రితమే దుబాయ్ నుంచి రావటం.. వచ్చిన నాటి నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటంతొ.. గాంధీకి షిఫ్ట్ చేశారు.
అతడి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించిన వైద్యులు.. పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. అతడి రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే కరోనా అతడికి సోకిందా? లేదా? అన్నది తేలుతుందని చెబుతున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు కు ఈ వ్యవహారం పెద్ద సవాలు గా మారుతుందనటంలో సందేహం లేదు.