కరోనా సెకండ్ వేవ్ ముగిసింది ..ఆ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన
కరోనా వైరస్...కరోనా వైరస్..గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. మొదటి వేవ్ తగ్గిందిలే అని అనుకునే సమయానికి మళ్లీ సెకండ్ వేవ్ అంటూ అందరిలో అలజడి సృష్టించింది. సెకండ్ వేవ్ లో కరోనా జోరు మాములుగా లేదు. రోజుకి ఐదు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మధ్యలోనే అనేక రకాలైన ఫంగస్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మూడో వేవ్ ముప్పు పొంచుకు కూర్చుంది అని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే .. తాజాగా సెకండ్ వేవ్ ముగింది అని తెలంగాణ ప్రభుత్వం ఓ కీలకమైన ప్రకటన చేసింది. తెలంగాణలో కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని చెప్పారు. అన్ని జ్వరాలను కరోనా వల్ల వచ్చే జ్వరంగా భావించవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు వచ్చాయని శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,200 డెంగీ కేసులు వచ్చాయని ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్ లెట్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్ ఫెక్షన్ సోకిందనే దాన్ని 'ఆర్ ఫ్యాక్టర్' అంటారు. ఇది రాష్ట్రంలో 0.7 మాత్రమే. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందాలి. రాష్ట్రంలో కొత్త పాజిటివ్ రేటు కూడా 0.5 శాతమే. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్నవారు 3300 మంది మాత్రమే. వీరిలో అత్యధికులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం 25 వేల పడకల్లోనూ ఆక్సిజన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 10 వేల కొత్త పడకలను త్వరలో అందుబాటులోకి తేనున్నాం. చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం అని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.65 కోట్ల మందికి టీకాల పంపిణీ పూర్తయింది. వీరిలో సుమారు 56 శాతం మంది మొదటి డోసు, 34 శాతం మంది రెండోడోసు స్వీకరించారు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 100 శాతం మందికి కనీసం ఒక డోసు పంపిణీ పూర్తయింది. జీహెచ్ ఎంసీ పరిధిలో 90 శాతం మంది కనీసం ఒక డోసును స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. కొవిడ్ రెండోదశ ఉధ్ధృతి అదుపులో ఉందని, మూడోదశ వచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై కోఠిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసరావు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.