దేశంలో కరోనా నాలుగో వేవ్ భయాలు.. పంజాబ్ కీలక ఆదేశాలు!
దేశంలో గత రెండు రోజులుగా రెండు వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో త్వరలోనే దేశంలో నాలుగో వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వాడకాన్ని తప్పనిసరి చేస్తూ... కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ధరించని వారికి 500 రూపాయల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జన రద్దీ కల్గిన ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ... అక్కడ భగవంత్ మాన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైల్లు, విమానాలు, ట్యాక్సీల్లో కచ్చితంగా మాస్కులు వాడాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, ఆఫీసులు.. వంటి వాటిల్లో కూడా మాస్కు తప్పనిసరంటూ పంజాబ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాకుండా కరోనా రెండు డోసుల టీకాలతో పాటు అర్హులంతా బూస్టర్ డోసు టీకాలు కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పుడే కరోనా వంటి మహమ్మారి నుంచి అందరూ ప్రాణాలు రక్షించుకోవచ్చని పేర్కొంది. అయితే మన దేశంలో ఇంకా చిన్న పిల్లలకు కరోనా టీకాలు అందుబాటులోకి రానందున... వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వివరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ వైరస్ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను పాటించాలని చెప్పింది. జాగ్రత్తగా మెలగాలని సూచించింది. మాస్కు తప్పనిసరిగా ధరించాలని... ఆ మాస్కులు కూడా మూడు పొరలు ఉండాలని ప్రత్యేకంగా చెప్పింది.
ఆరు బయటకు వెళ్లే సమయంలో నలుగురితో కలిసి తిరిగిన సందర్భాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించింది. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు.. ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలంది. తరచూ చేతులను సబ్బుతో కడ్డుక్కోవాలని చెప్పింది. శానిటైజర్ ను ఎప్పుడు వెంట ఉంచుకోవాలని.. ఆరు బయట ప్రదేశాలను చేతితో తాకిన సందర్భంలో శానిటైజర్ వాడాలని కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, అలసట, రుచి కోల్పోవడం, వాసన రాకపోవడం, నిద్రమత్తుగా అనిపించడం, కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఒకవేళ కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయితే.. వ్యక్తిగత ఐసోలేషన్ పాటించాలని చెప్పింది.