ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు పెంచుతారా ?

డీలిమిటేషన్ ప్రక్రియకు లోక్ సభ సాక్షిగా బ్రేక్ పడినట్లే. ఎందుకంటే విపక్షాలు అన్నీ కట్టుగా ఉన్నాయి.;

Update: 2026-04-19 17:30 GMT

డీలిమిటేషన్ ప్రక్రియకు లోక్ సభ సాక్షిగా బ్రేక్ పడినట్లే. ఎందుకంటే విపక్షాలు అన్నీ కట్టుగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్ని సార్లు బిల్ ప్రవేశపెట్టినా నంబర్ మారకపోతే రిజల్ట్ ఇలాగే వస్తుంది. దాంతో పాటు ఇండియా కూటమి అయితే పట్టుదలగా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు డీలిమిటేషన్ కి ముడి పెట్టడం మీద పూర్తి వ్యతిరేకతతో విపక్షాలు ఉన్నాయి. పైపెచ్చు 2026 జనాభా లెక్కలు తేలిన తరువాత కుల గణన అయిన తర్వాత కులాల వారీగా రిజర్వేషన్లు కూడా చేయాలని కోరుతున్నారు. దంతో ఆ వ్యవహారం ఇప్పట్లో తేలడం బహు కష్టంగా ఉంది అని అంటున్నారు.

విభజన చట్టం ప్రకారం :

అదే సమయంలో 2029 ఎన్నికలు అయితే ఇపుడు ఉన్న ఎంపీ సీట్ల ప్రకారమే జరుగుతాయని స్థూలంగా తెలుస్తున్న విషయం. ఏదైనా అద్భుతం జరిగితేనే తప్ప డీలిమిటేషన్ అన్నది 2029 లో అసాధ్యం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపు సంగతి ఏమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. అయితే కేంద్రం చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియకు ఏపీ తెలంగాణా అసెంబ్లీ సీట్లకు సంబంధం లేదని మరో వాదన ముందుకు వస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225 గానూ తెలంగాణాలో 119 సీట్లను 150 దాకా పెంచాలని అంటున్నారు. అది చేయవచ్చు అని కూడా చెబుతున్నారు.

మూడు ఎన్నికలు పూర్తి :

నిజానికి 2014లో విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచేందుకు వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఎన్నికలు తోసుకుని వచ్చేశాయి. అయితే 2019లో సీట్లు పెంచమని నాటి టీడీపీ కేంద్రాన్ని కోరింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ విధంగా అనుకూలం చేసుకోవాలనుకుంది. అలాగే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపునకు తన వంతుగా కేంద్రం వద్ద కోరుతూ వచ్చారని అంటారు. కానీ 2019 కాదు కదా 2024లోనూ ఆ ప్రసక్తి లేకుండానే ఎన్నికలు జరిగిపోయాయి. మరి 2029 ఎన్నికల సంగతేంటి అన్న చర్చ ముందుకు వస్తోంది.

పెంపు చేయాల్సిందేనా :

ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పార్టీలు అన్నీ డీలిమిటేషన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువగా సీట్లు పెరిగితే కూటమి పార్టీలను న్యాయం జరిగేది అని కూడా అనుకున్నారు. మూడు పార్టీలకూ 2024 ఎన్నికల్లో సీట్ల పంచాయతీ చాలా కష్టం అయిపోయింది. అయితే వైసీపీని గద్దె దించేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు రావడానికి ఎన్నో త్యాగాలు చేశారు. అందులో భాగమే జనసేన 21 సీట్లకే పరిమితం అయింది అలాగే టీడీపీలో త్యాగరాజులుగా అనేక మంది సీనియర్లు మారిపోయారు ఈ నేపధ్యంలో అన్ని పార్టీల ఆశలు 2029 మీదనే ఉన్నాయి. దాంతో డీలిమిటేషన్ మీదనే ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ బ్రేకులు పడడంతో మరోసారి అసెంబ్లీ సీట్ల పెంపు డిమాండ్ ముందుకు వస్తోంది అని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి కేంద్రం కనుక తలచుకుంటే ఏపీ తెలంగాణా వరకూ అసెంబ్లీ సీట్లు భారీగా పెరుగుతాయని అంటున్నారు.

జరిగే పనేనా :

అయితే అది జరిగే పనేనా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది కచ్చితంగా చేయాల్సిందే. అదే జరిగితే కచ్చితంగా ఇపుడున్న సీట్లు మరింతగా పెరుగుతాయి. ఒకవేళ కేంద్రం ప్రతిపాదించినట్లుగానే ఇపుడున్న సీట్లకు అదనంగా మరో 50 శాతం అంటే ఏపీలో అసెంబ్లీ సీట్ల నంబర్ 263 కి చేరుకుంటుంది. అలాగే తెలంగాణాలో అయితే 179 కి చేరుకుంటుంది. అలా ఎక్కువగా సీట్లు పెంచుకునే చాన్స్ ఉంటుంది. దానిని కాదనుకుని 225 కి ఏపీ 150 కి తెలంగాణా పరిమితం అయితే నష్టమే అని అంటున్నారు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అయితే ఉన్నంతలో ఈ సీట్ల పెంపు బెటర్ ఆప్షన్ అని కూడా కూటమి వర్గాలలో ఉంది అని అంటున్నారు.

అక్కడే అడ్డంకి :

అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల పెంపు కోసం చూస్తున్న క్రమంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల విషయం మీద ఫోకస్ చేయడం అన్నది పెద్దగా ఉండదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో కూటమికి ఈ సీట్ల పెరుగుదల లాభం కలిగిస్తే తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి రాజకీయ లాభం కలిగేలా ఉంటుంది కాబట్టి ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకునేది ఉండదని అంటున్నారు. మొత్తం మీద అయితే అసెంబ్లీ సీట్ల పెంపు అన్నది రాజకీయ ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. సో ఏపీలో కూటమి పెద్దలు కేంద్రం మీద తమ ప్రభావం చూపిస్తే 2029 నాటికి ఇపుడున్న సీట్లు పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News