• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జపాన్‌ నౌకలో ఇద్దరు...

జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కరోనా..రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

By - Tupaki Desk
Update: 2020-02-13 10:00 GMT
జపాన్‌ తీరప్రాంతం యొకొహామా పోర్టులో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలో ప్రయాణిస్తున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా..135  మంది కోవిద్‌-19 (కరోనా వైరస్‌) పాజిటివ్‌ గా తేలింది. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. నౌక లో ఉన్న మిగిలిన వారు ఆందోళనకి గురౌతున్నారు. జపాన్‌ కు చెందిన పర్యాటక నౌక డైమండ్‌ ప్రిన్సెస్‌ లో నుంచి హాంగ్‌ కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించిన నేపథ్యంలో..ఫిబ్రవరి 3ను నౌకను యొకొహామా పోర్టులోనే నిలిపేశారు. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మొత్తం 3700 మంది ప్రయాణికులుండగా..వీరిలో 138 మంది భారతీయులున్నట్లు సమాచారం.  

నౌకలో చిక్కుకున్న తమిళనాడు లోని మధురైకి చెందిన అంబలగన్‌ తమను కాపాడాలని వేడుకుంటూ వీడియోలను షేర్‌ చేయడం తో ఇప్పుడు ఈ వార్త వైరల్‌ గా మారింది. ప్రయాణీకులను ఎక్కడికీ కదలకుండా ఉంచారని, వారు ఉన్న గదులకే ఆహారాన్ని పంపుతున్నారని వీడియోలో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు నౌకలోని ఉంటే  తమకూ కరోనా వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉందని, తమను భారత ప్రభుత్వం కాపాడాలని సిబ్బంది తరపున అంబలగన్‌ వేడుకున్నారు.

సిబ్బందికి కేటాయించిన మెస్‌లో భోజనం చేస్తామని దీంతో తమకు సులభంగా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, తమను ఇక్కడ నుంచి భారత్‌కు తీసుకువెళ్లాలని అంబలగన్‌ అభ్యర్థించారు. మరో భారత సిబ్బంది వినయ్‌ కుమార్‌ సర్కార్‌ కూడా డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బందిని వెనక్కి పిలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ వీడియో రూపొందించారు. గతంలో పాక్‌ సేనల నుంచి ఐఏఎఫ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ను కాపాడినట్లే తమనూ ఇక్కడి నుంచి రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నౌకకు సంబంధించిన ప్రోటోకాల్స్ తమను వీడియో షేర్‌ చేసేందుకు అనుమతించకపోయినా అసలు తాము అప్పటివరకూ బతికిఉంటమనే నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  డైమండ్ ప్రిన్స్ నౌక సిబ్బందిలో 132 మంది భారతీయులు, ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారు. కాగా , ఫిబ్రవరి 19, 2020 వరకు క్రూయిజ్ షిప్‌ నిర్భందంలోనే ఉంచుతున్నట్లు జపాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫిబ్రవరి 12, 2020 నాటికి, నౌకలో ఉన్న ఇద్దరు భారతీయ సిబ్బంది సహా మొత్తం 174 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది.
Tags:    
  • Corona Virus In China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS