కరోనా ఎఫెక్ట్ .. నుమాయిష్ ఎగ్జిబిషన్ వాయిదా : మంత్రి ఈటెల రాజేందర్ !
నుమాయిష్ ఎగ్జిబిషన్ .. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వార్షిక ఎగ్జిబిషన్ .. ఈ ఎగ్జిబిషన్ కి ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణంగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం అవుతుంది. కానీ, కరోనా కారణంగా జనవరి నెలలో ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సూచనలు అయితే, కనిపించడం లేదు. అయితే ఆలస్యమైనా కూడా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నుమాయిష్ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిపై త్వరలోనే మరో అప్డేట్ ఇస్తామని తెలిపారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైన 79 సంవత్సరాలలో మొదటిసారిగా ఎగ్జిబిషన్ అనుకున్న సమయానికి కాకుండా, కొన్ని నెలల పాటు వాయిదా పడింది. అయితే మార్చి , ఏప్రిల్ లో పెట్టాలని అనుకుంటున్నా కూడా కరోనా తగ్గితేనే ఉంటుంది లేకపోతే ఈ ఏడాది కష్టమే అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. 46 రోజుల పాటు నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు.
లక్షలాదిగా ప్రజలు వచ్చే ఎగ్జిబిషన్ లో కరోనా మార్గ దర్శకాలు పాటిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ భావిస్తున్నా ప్రస్తుతం అంత రిస్క్ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాద్ లోనే కాకుండా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి చాలామంది ఈ అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ వ్యాప్తంగా 20 వేల మందికి జీవనోపాధి లభిస్తుంది. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరగడమే కాకుండా, ప్రభుత్వానికి ఎగ్జిబిషన్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. కానీ కరోనా అటు వ్యాపారుల ఆదాయానికి , ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టింది.