• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజయవాడలో కుళ్లిన మాంసం...

విజయవాడలో కుళ్లిన మాంసం అమ్మకాలు..!

By - Tupaki Desk
Update: 2020-04-27 15:36 GMT
విపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ప్రజలు, పాలకులు అంతా కరోనా కట్టడి చేయడంలో బిజీగా ఉండటంతో .. పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరనుకున్నారో ఏమో ఇదే అదనుగా భావించి కుళ్లిన మాంసం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. మరణించిన కోళ్లను చికెన్ దుకాణాల్లో మాంసంగా విక్రయిస్తున్నారు విజయవాడలోని కొందరు దుకాణదారులు.

రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు విజయవాడ నగరాన్ని రోడ్ జోన్ ‌గా ప్రకటించారు. అందులో భాగంగానే మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. అయితే శివారు ప్రాంతంలో మాత్రం మాంసం అమ్మకాలు కొనసాగుతున్నాయి. జక్కంపూడి ప్రాంతంలోని ఓ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న ఓ చికెన్ షాపులో మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా తనిఖీలు జరిపారు.

దుకాణంలో కుళ్లిన వాసన వస్తున్న కోళ్లను గుర్తించారు. వెంటనే దుకాణాన్ని సీజ్ చేశారు. రెడ్‌ జోన్ కారణంగా నగరంలో మాంసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో దుకాణ దారులు ఇలా అక్రమాలకు పాల్పడుతూ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికే కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏ మాత్రం సమంజసం కాదు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • vijayawada 
  • Rotten Meat Sales In Vijayawada 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS