ఒక్క‌సారి క‌నెక్ట్ అయితే చాలు.. దేశంలో ఎక్క‌డైనా క‌నెక్ట్ కావొచ్చ‌ట‌!

Update: 2019-07-16 05:35 GMT
సాంకేతికత అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఓపెన్ వైఫైను త‌ర‌చూ వినియోగించే వారికి మంచి రోజులు వ‌చ్చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కేంద్రం అమ‌లు చేయ‌నున్న విధానం ప్ర‌కారం ఒక్క‌సారి ఓపెన్ వైఫైను క‌నెక్ట్ అయితే చాలు.. ఇక మ‌ళ్లీ క‌నెక్ట్ కావాల్సిన అవ‌స‌రం లేదు. దేశంలో మీరెక్క‌డికి వెళ్లినా.. బ‌హిరంగ వైఫైని ఇట్టే క‌నెక్ట్ అయ్యేలా ఒక విధానాన్ని తెర మీద‌కు తీసుకురానుంది కేంద్ర ప్ర‌భుత్వం.

ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఓపెన్ వైఫైను క‌నెక్ట్ చేసుకోవ‌టానికి అదే ప‌నిగా ప్ర‌తి ఒక్క‌సారి మ‌న వివరాల్ని న‌మోదు చేసుకొని.. క‌నెక్ట్ కావాల్సిన  అవ‌స‌రం లేదు. దానంత‌ట అదే క‌నెక్ట్ అయ్యే సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ విధానంలో ఒక మొబైల్ వినియోగ‌దారుడు ఒక ఓపెన్ వైఫైలో ఒక్క‌సారి త‌న వివ‌రాల్ని న‌మోదు చేస్తే స‌రిపోతుంది. ఇక‌.. ఎక్క‌డికి వెళ్లినా దానంత‌ట అదే క‌నెక్ట్ అయ్యేలా టెక్నాల‌జీని మార్చ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వేర్వేరు నెట్ వ‌ర్క్ ల‌లో అది సాధ్య‌మ‌య్యే అవ‌కాశం లేదు. త్వ‌ర‌లో రానున్న ఈ టెక్నాల‌జీతో బీఎస్ ఎన్ ఎల్.. ఎయిర్ టెల్.. జియో లాంటి ఏ నెట్ వ‌ర్క్ అయినా.. ఇట్టే క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం రానుంది. అయినా.. జియో వ‌చ్చాక‌.. ఓపెన్ వైఫై మీద ఆధార‌ప‌డేటోళ్లు.. డేటాను ఆచితూచి..గీసి.. గీసి వాడేటోళ్లు పూర్తిగా త‌గ్గిపోయార‌నే చెప్పాలి.
Tags:    

Similar News