డిఫరెంట్ లుక్ లో పవన్.. పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డ్రెస్సింగ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఉండే వారు తెల్లని ఖద్దరు చొక్కాలో మెరిసిపోతుంటారు.;

Update: 2025-12-30 11:30 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డ్రెస్సింగ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఉండే వారు తెల్లని ఖద్దరు చొక్కాలో మెరిసిపోతుంటారు. అలవాటు ప్రకారం కొందరు పంచ, పైజామా వేసుకుంటే, ఇంకొందరు ఫ్యాంటు, షర్టు ధరిస్తారు. కానీ 99 శాతం మంది మాత్రం తెల్లని వస్త్రాలనే ఎంచుకుంటారు. హుందాతనం, పెద్దరికం కోసం ఇలాంటి డ్రెస్సింగ్ స్టైలును పొలిటీషియన్స్ అంతా పాటించడం అంతా చూస్తున్నది. అయితే అందరిలా కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ప్రత్యేక స్టైలుతో ఎప్పటికప్పుడు కొత్త లుక్ లో కనిపించడమే ఆసక్తికరం.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో పవన్ తెల్లని కుర్తా పైజామా ధరించేవారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన ఎక్కువగా తెల్లని కుర్తా, పైజామా లేదా ధోవతి ధరిస్తున్నారు. ఇది ఆయనకు ఒక 'స్టేపుల్' (సాధారణ) లుక్‌గా మారిపోయింది. ఇదే సమయంలో చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పవన్.. మంగళగిరి, ఉప్పాడ వంటి ప్రాంతాల నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ఎక్కువగా ధరిస్తుంటారు. ఇదే సమయంలో ఆయన అప్పుడప్పుడు తన లుక్ పూర్తిగా మార్చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

పాలిటిక్స్ లోకి రాకముందు సినిమాల్లో సినిమాల్లో స్టైలిష్ దుస్తులతో కనిపించేవారు పవన్. పాలిటిక్స్ లో బిజీ అయ్యాక స్టైల్ పూర్తిగా మార్చేసినా.. కొన్నికొన్ని సందర్భాల్లో స్టైలిష్ డ్రెస్సులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్ స్టైలిష్ గా కనిపించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీషర్టు, కార్గో ఫ్యాంట్ లో కనిపించిన పవన్ డిఫరెంట్ లుక్ సోషల్ మీడియాను ఆకర్షించినట్లు చెబుతున్నారు.

పవన్ ను ఇలా చూసిన వారు సాధారణ రాజకీయ నాయకుడికి భిన్నంగా ఆయన డ్రెస్సింగ్ ఉంటోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి లోకేశ్ డ్రెస్సింగ్ స్టైల్ కు భిన్నంగా పవన్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన డ్రెస్సింగ్ లో ఒక సినిమా హీరో స్టైల్ తోపాటు రాజకీయ నాయకుడి అహర్యం, ఆధ్యాత్మిక భక్తిభావం, ఉద్యమకారుడి ఉత్సాహం చూపేలా బహుముఖ రూపం కనిపిస్తుంటుంది. కొద్దిరోజుల క్రితం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి రెండు చోట్ల డిఫరెంట్ లుక్ లో కనిపించి సోషల్ మీడియా అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నారు.

సందర్భానుసారం పవన్ ఎంచుకునే విభిన్నమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో పర్యటించిన సమయంలో పవన్ నల్లని టీషర్టు, క్యామో-ప్యాంట్ (ఆర్మీ, పారా మిలటరీ యూనిఫాం) ధరించడంపై అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సుకు కమాండర్ గా తనను తాను ప్రజెంట్ చేసుకునేలా పవన్ అప్పట్లో డ్రెస్ వేశారు. ఇక ఆ తర్వాతి రోజు చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లిన పవన్ ఇన్-షర్డ్ తో కనిపించారు. అదేవిధంగా గతంలో ఆయన దీక్షా వస్త్రాలతో ఒక భక్తుడి తనలో ఉన్న ఆధ్యాత్మికతను చాటుకున్నారు. మొత్తానికి తన డ్రెస్సింగ్ తో పవన్ సమ్ థింగ్ స్పెషల్ గా నిలుస్తున్నారు.

Full View
Tags:    

Similar News