ఆగమాగం చేసేసిన ఫేక్ సర్వే పోస్ట్
గతంలో ఏదైనా సమాచారం చేతికి వచ్చిందంటే దాన్ని ఎంతోకొంత నమ్మే పరిస్థితి. ఇప్పుడా పరిస్థితి ఎంతమాత్రం లేని దుస్థితి. ప్రముఖ మీడియా సంస్థలు సైతం సమాచార సేకరణ విషయంలో తప్పులో కాలేయటం.. పెద్ద పెద్ద అంశాల విషయంలోనూ తప్పులు చేయటంతో.. ఎవరు ఎలాంటి సమాచారాన్ని అందించినా.. వెంటనే నమ్మలేని పరిస్థితి నెలకొని ఉంది. మీడియా సంస్థల పోటీ తత్వంతో పాటు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి.
పెరిగిన టెక్నాలజీతో పరిస్థితులు ఎంతవరకూ వెళ్లాయంటే.. కొన్ని మార్ఫింగ్ ట్వీట్లను సైతం సోషల్ మీడియాలోకి వదలటం.. వాటిని పట్టుకొని ప్రముఖులు స్పందించటం.. అవి కాస్తా వైరల్ కావటం చూస్తున్నదే. మొన్ననే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన నకిలీ పోస్ట్ ఒకటి హడావుడి చేసింది. గతంలో ఆయన చెప్పిన మాటల్ని.. వక్రీకరించి.. పవన్ ఎలా అయితే ట్వీట్ పోస్ట్ (ఫాంట్ సైతం) చేస్తారో.. అదే ఫాంట్ ను.. అదే సైజ్ లో వాడేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీన్ని పట్టుకొని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయి.. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక పొలిటికల్ ట్వీట్ ఒకటి రాజకీయ పక్షాల మధ్యన.. వారిని అభిమానించే వారి మధ్య సోషల్ మీడియాలో పెద్ద రగడను సృష్టించాయి. ప్రపంచంలోని అవినీతి రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్‌కు నాలుగో స్థానం అంటూ బీబీసీ పేరుతో విడుదలైన టాప్ 10 అవితీని రాజకీయ పార్టీల జాబితా పెను సంచలనాన్ని సృష్టించింది.
ఈ ట్వీట్ పై పలువురు స్పందించటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం షురూ అయి.. అంతకంతకూ పెరుగుతూ పోయింది. వైరల్ అయిన ఈ పోస్ట్‌లో నిజం ఎంతన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పోస్ట్ సృష్టించిన రగడ బీబీసీ దృష్టికి వెళ్లి.. చివరకు ఆ సంస్థ స్పందించింది. తాము ఇలాంటి సర్వేలు అస్సలు చేయమని.. తమకూ.. ఆ సర్వేకు సంబంధం లేదని తేల్చారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఫేక్ సర్వేను.. ఒక పాపులర్ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. దీంతో.. ఈ సమాచారం వైరల్‌గా మారింది. బీబీసీ ప్రతినిధి స్వయంగా ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇవ్వటంతో అప్పటివరకూ మాటల యుద్ధానికి దిగిన వారు నాలుక్కర్చుకొని కామ్ అయ్యారు. అత్యుత్సాహంతో వెనుకా ముందు చూసుకోకుండా ప్రతిదానికి స్పందిస్తూ పోతే.. ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/