వేడి పుట్టిస్తున్న వింటర్ సమావేశాలు..కాంగ్రెస్ వాకౌట్

Update: 2019-11-19 08:46 GMT
ప్రస్తుతం అసెంబ్లీ - పార్లమెంట్ సమావేశాలు .. రైతు బజార్లలా తయారైపోయాయి. సమావేశాలు ప్రారంభం కాగానే  ..అసలు సమస్యలని పక్కనపెట్టి .. అనవసర విషయాలపై రాద్దాంతం చేయడం ఇప్పటి రాజకీయ నేతలకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో అసెంబ్లీ ని - పార్లమెంట్ ని ఆలయాలుగా పూజించేవారు కానీ - ఇప్పుడు అవే సాక్షిగా తిట్టుకుంటున్నారు - కొట్టుకోవడానికి కూడా కాలు దువ్వుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వింటర్ పార్లమెంట్  సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజున కూడా  రెండు సభల్లోనూ గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే JNU వివాదంపై విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అటు సోనియా కుటుంబానికి SPG భద్రత తొలగింపుపై కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మద్యే spg రూల్స్ ని సరిగా పాటించడం లేదు అంటూ కేంద్రం వారికి spg  భద్రతని తొలగించిన విషయం అందరికి తెలిసిందే. విపక్ష సభ్యులు వెల్‌ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఓ దశలో సభ్యులపై స్పీకర్‌ ఓమ్‌ బిర్లా అసహనం వ్యక్తం చేశారు.

సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుండగా.. రాజ్యసభలో పై అంశాలతో పాటు మార్షల్స్ డ్రెస్స్ కోడ్‌ పై సభ్యులు నిరసన చేపట్టారు. అటు రాజ్యసభలోనూ ప్రారంభం నుంచే గందరగోళం నెలకొంది. జేఎన్‌ యూ వివాదం - కశ్మీర్‌ అంశం - మార్షల్స్‌ డ్రెస్‌ కోడ్‌ పై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.




Tags:    

Similar News