కాంగ్రెస్ సీనియర్లకు అవకాశం దక్కేనా?

Update: 2018-11-13 07:18 GMT
తెలంగాణ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. తొలి జాబితాలో పేర్లు ఉన్న వారు ఇంతవరకు గట్టెక్కామని అనుకుంటుండగా - టిక్కెట్ దక్కని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు కూడా ఉన్నారు.

ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మిగిలింది ఐదారు రోజులే.   65 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇంకా 29 మందిని నిర్ణాయించాల్సి ఉంది. 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 94 సీట్లకు పోటీ చేస్తుంది.  పెండింగ్ జాబితాలో  ప్రముఖుల భవిష్యత్తు ముడిపడి ఉండటంతో..  ఎవరి పేర్లు ప్రకటిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పీజేఆర్ తనయుడు విష్ణు - కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి -మాజీ ఎంపీ విజయశాంతి - జానారెడ్డి తనయుడు ఆశిస్తున్న మిర్యాలగూడ సీటు - టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల.. వంటి వారి సీట్ల విషయంలో ఇంకా స్పష్టత లేదు. వీటితో పాటు మరి కొన్ని సీట్లను పెండింగ్ లో పెట్టారు.  నామినేషన్లకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఆశావహుల ఒత్తిడి అధికమైంది. 

కాగా, కోమటిరెడ్డి సోదరులు పట్టు నిలుపుకున్నారు.  చెరో సీటుతో పాటు - సన్నిహితుడు  చిరుమర్తి లింగయ్యకు కూడా బెర్త్ కన్ఫాం చేయించుకున్నారు.  ఒకవేళ లింగయ్యకు సీటు ఇవ్వకపోతే  కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని కోమటిరెడ్డి సోదరులు గట్టిగా హెచ్చరించారు.దీంతో అధిష్టానం దిగివచ్చి వారికి మూడు సీట్లు ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ లో అదిరించి.. బెదిరించి పట్టున్న వారికే సీట్లు దక్కాయని తాజా జాబితాను బట్టి తెలుస్తోంది.
Tags:    

Similar News