సీనియర్లు బీజేపీతో కుమ్మకైయ్యారన్న రాహుల్..కౌంటర్ ఇచ్చిన సిబల్ - ఆజాద్!
దేశంలో 135 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని విదంగా ఇప్పుడు కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే విధంగా పరిస్థితి తయారైంది. ఈ సమయంలో అధినేత్రి సోనియా గాంధీకి 23 మంది సీనియర్లు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోనియాకు అత్యంత విధేయులుగా ఉన్న ఆ సీనియర్లు బీజేపీ వలలో చిక్కుకున్నారని, కమలనాథుల కుట్రల్లో పావులుగా మారారనే మరో అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ వాదన ను తెరపైకి తీసుకువచ్చింది .. సాక్ష్యాత్తూ రాహుల్ గాంధీనే కావడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక మండలి ‘సీడబ్ల్యూసీ సోమవారం సమావేశమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో అనూహ్య పరిణామాలు, సంచలనాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని, కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్లు రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లేఖ విడుదలైన టైమింగ్ పైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రాహుల్ మాటలకి , సీనియర్లు కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపించకుంటే రాజీనామా చేస్తామని తెగేసి చెప్పారు. తాము బీజేపీతో కుమ్మకయ్యామనడానికి ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ చిన్న పాయింట్ చూపించినా తక్షణమే రాజీనామా చేస్తామంటూ గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ సవాలు విసిరారు. తమను రాహుల్ గాంధీ ఎంత దారుణంగా అవమానించాడో సిబల్ స్వయంగా ట్విటర్ ద్వారా అందరికి తెలియజేసారు.
గడిచిన 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా తాము ఏ విషయంలోనూ వ్యవహరించలేదని గుర్తు చేశారు. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షాన నిలిచి పోరాటం చేసాం అని , మణిపూర్ లో బీజేపీని గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల కపిల్ సిబాల్ అసహనం వ్యక్తం చేశారు. ఆజాద్ కూడా దాదాపు ఇదే రీతిలో రియాక్ట్ అయ్యారు.