వెయ్యి కోట్లకు ఖర్చు చేసింది రూ.200 కోట్లేనా?

Update: 2016-03-28 04:22 GMT
కేటాయింపులు భారీగా.. ఘనంగా ఉన్నట్లు కనిపించే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లోని డొల్లతనాన్ని బయటపెడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెలరేగిపోయారు. ఆదివారం వారు సంధిస్తున్న ప్రశ్నలకు అధికారపక్షం నోటి నుంచి సమాధానం రాని పరిస్థితి. ఉదాహరణలతో సహా తెలంగాణ కాంగ్రస్ నేతలు చెలరేగిపోతుంటే నోట మాట రాని పరిస్థితిలో తెలంగాణ అధికారపక్షం ఉండిపోయింది.

ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ సర్కారు గత బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. కానీ.. చేసిన ఖర్చు మాత్రం రూ.200కోట్ల మార్క్ ను దాటకపోవటాన్ని ఎత్తి చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. వందలాది కోట్ల రూపాయిలు కేటాయింపులు జరిపినా? వాటిని అమలు చేసే విషయంలో ఉన్న అంతరాన్ని ప్రస్తావించటమే కాదు.. అలా ఖర్చు చేయని విభాగాల్ని ప్రశ్నించారా? వారి వివరణ కోరారా? అని ప్రశ్నించారు.

కేటాయింపులు ఖర్చుల గురించి విపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని తెలంగాణ అధికారపక్షం తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వాలతో పోలిస్తే.. కేటాయింపులకు పెట్టిన ఖర్చు విషయంలో ఎంతో మెరుగ్గా ఉన్నట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. గతాన్ని వదిలేస్తే.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రం నూటికి నూరు శాతం నిధుల్ని ఖర్చు చేస్తామని చెప్పటం కనిపించింది. ఎస్సీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులు.. చేసిన ఖర్చు విషయంలో విపక్షాల ధాటికి తెలంగాణ మండలిలో అధికారపక్షానికి చుక్కలు కనిపించాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News