ప్ర‌తిప‌క్షం ఇప్పుడు మేలుకుంది

Update: 2016-07-19 05:01 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మూడు నెలల క్రితం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పుల తడక అని వాదిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు తామిచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో దాన్ని నిరూపిస్తామని ప్ర‌క‌టించారు. కానీ నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యలోపం - అస‌లేం ప్ర‌జెంట్ చేయాల‌నే స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ప్ర‌స్తుతం అందుకు ముందుకు వ‌చ్చారు.

అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన స‌మ‌యంలోనే  కౌంటర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడైంది. అప్పటినుంచి సుదీర్ఘ కసరత్తు చేస్తున్న హస్తం పార్టీ నేతలు….ఫైనల్ అవుట్ పుట్ ను రెడీ చేశారు. కేసీఆర్‌ సర్కార్ గూగూల్ మ్యాప్ తో వివరిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక‌డుగు ముందుకు వేసింది. ఏకంగా 3డీ టెక్నాలజీతో ప్రజెంటేషన్ కు ప్లాన్ చేసింది. ఈ నెల 23 న ప్రజెంటేషన్ ను డేట్ ఫిక్స్ చేశారు. త‌మ ప్ర‌జెంటేష‌న్‌ లో భాగంగా  కృష్ణా - గోదావరి నదుల నీటిని ఎలా వాడుకోవాలో ప్రత్యామ్నాయం చూపిస్తామంటున్నారు.

ఇదిలాఉండ‌గా తమ ప్రజెంటేషన్ కు కూడా అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే దీనిపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయిన‌ప్ప‌టికీ రిజర్వాయర్లు లేకుండానే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం ఎలాగో చూపించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధ‌మ‌య్యారు.హర్యానాలోని జవహర్ లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇందుకు ఉదహారణగా చెప్ప‌నున్నారు. ఇంత‌కూ ఈ సర్కార్ కు కౌంటర్ గా చెబుతున్న ఈ ప్రజెంటేషన్ ను ఎవ‌రు ఇవ్వ‌నున్నారు అనేదేగా మీ ప్ర‌శ్న? పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈ ప్ర‌జెంటేష‌న్‌ ఇవ్వబోతున్నారు.!
Tags:    

Similar News