నిరుద్యోగుల‌కు కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ ఆఫ‌ర్!

Update: 2020-02-03 17:30 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో త‌న మెనిఫెస్టోని విడుద‌ల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో అన్ని రాజ‌కీయ పార్టీల తీరునే కాంగ్రెస్ కూడా వివిధ వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. ఉచితాల‌ను ప్ర‌క‌టించి ఓట్ల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా నిరుద్యోగ‌భృతిని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇది వ‌ర‌కూ ఏపీతో స‌హా విధ రాష్ట్రాల్లో పార్టీలు ఈ త‌ర‌హా ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాయి.

గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ఈ ప‌థ‌కాన్ని ఏపీలో త‌న ఐదేళ్ల పాల‌న చివ‌రిలో అమ‌లు చేశారు. అయితే చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు చేశారు. వెయ్యి- రెండు వేల రూపాయ‌ల స్థాయిలో నిరుద్యోగ భృతి ఇచ్చారు. కానీ ఎన్నిక‌ల్లో నెగ్గుకు రాలేక‌పోయారు. ఆ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాకా నిరుద్యోగ భృతి ర‌ద్దు అయ్యింది. ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ఏ మాత్రం సీరియ‌స్ గా తీసుకోలేదు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ రేంజ్ వెయ్యి, రెండు వేలు కాదు.. ఏకంగా ఐదు వేల రూపాయ‌లు! నిరుద్యోగుల‌కు భారీ స్థాయిలో నెల‌వారీ వేత‌నాన్ని ఆఫ‌ర్ చేస్తోంది ఢిల్లీ కాంగ్రెస్. ఐదు వేల రూపాయ‌ల నుంచి 7,500 రూపాయ‌ల వ‌ర‌కూ నిరుద్యోగ‌భృతి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు త‌మ మెనిపెస్టో లో ప్ర‌క‌టించారు. ఇలా నిరుద్యోగుల ఓట్ల‌ కు కాంగ్రెస్ గాలం వేసే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అలాగే.. ఇందిరా క్యాంటీన్లు, ఇళ్ల‌ కు మూడు వంద‌ల యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్, ఢిల్లీలో కాలుష్య నివార‌ణ‌కు చ‌ర్య‌లు.. వంటి వాటిని కూడా కాంగ్రెస్ త‌న మెనిఫెస్టో లో పేర్కొంది. ఇవి ఢిల్లీ ఓట‌ర్ల మ‌దిని ఏ మేర‌కు గెలుస్తాయో మ‌రి!
Tags:    

Similar News