ట్రంప్ ను ‘బాలయ్య’తో కొట్టిన ఇరాన్.. అట్లుంటది మరీ.. వైరల్ వీడియో
అంతర్జాతీయ రాజకీయాలంటే సాధారణంగా దౌత్యపరమైన లేఖలు.. తీవ్రమైన హెచ్చరికలు.. ఐక్యరాజ్యసమితి వేదికగా ఉపన్యాసాలు ఉంటాయి.
అంతర్జాతీయ రాజకీయాలంటే సాధారణంగా దౌత్యపరమైన లేఖలు.. తీవ్రమైన హెచ్చరికలు.. ఐక్యరాజ్యసమితి వేదికగా ఉపన్యాసాలు ఉంటాయి. కానీ ఈసారి ఇరాన్ వర్సెస్ అమెరికా డ్రామాలో ఊహించని విధంగా మన 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. అవును మీరు విన్నది నిజమే.. వైట్ హౌస్ ఇచ్చే వార్నింగ్‌లకు భయపడేది లేదని చెప్పడానికి ఇరాన్‌కు హాలీవుడ్ సినిమాలు సరిపోలేదు.. చివరికి మన బాలయ్య బాబు నటించిన ‘భగవంత్ కేసరి’ సీన్ కావాల్సి వచ్చింది.
అసలు కథేంటంటే.. ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇలాంటి బెదిరింపులకు ఇరాన్ మిసైళ్ల విజువల్స్ చూపించి కౌంటర్ ఇస్తుంటుంది. కానీ ఈసారి జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీకి కాస్త క్రియేటివిటీ ఎక్కువైంది. "ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే ఆయన హాలీవుడ్ మానివేసి బాలీవుడ్ సారీ.. టాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్లున్నారు" అంటూ సోషల్ మీడియాలో సెటైర్ వేసింది. అంతటితో ఆగకుండా ‘భగవంత్ కేసరి’లోని ఒక మైండ్ బ్లాకింగ్ యాక్షన్ క్లిప్‌ను జత చేసింది.
ఆ వీడియోలో ఏముందో ప్రత్యేకంగా చెప్పాలా? శత్రువులు నలువైపులా చేరి బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే.. మన బాలయ్య బాబు సీరియస్‌గా రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ మూతను కవచంలా పట్టుకుని ఆ తూటాలన్నింటినీ అత్యంత నల్లటి కూల్‌నెస్‌తో అడ్డుకుంటారు. శత్రువుల గన్స్‌లో బుల్లెట్లు ఖాళీ అయ్యే వరకు ఓపికగా ఉండి.. ఆ తర్వాత నేరుగా గ్యాస్ సిలిండర్లతో ఎదురుదాడికి దిగుతారు.
ఇప్పుడు ఇరాన్ ఎంబసీ వేసిన లెక్చర్ ఏంటంటే.. "మీ దగ్గర ఎన్ని అత్యాధునిక ఆయుధాలున్నా ఎంతైనా కాల్చుకోండి.. మా దగ్గర బాలయ్య మార్క్ 'మ్యాన్‌హోల్ మూత' కవచం ఉంది. మీ బుల్లెట్లు అయిపోయాక మా కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందో తెలుసుగా.." అని ట్రంప్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిందన్నమాట.
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరు దేశాల నాయకులు సీరియస్ ఉపన్యాసాలకు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ ఎంబసీ షేర్ చేసిన ఈ 'మాస్ కౌంటర్' నెట్టింట దుమ్మురేపుతోంది. తెలుగు మీమర్స్, బాలయ్య అభిమానులు అయితే "జాగ్రత్త ట్రంప్ గారూ.. అక్కడ ఉన్నది మన బాలయ్య, దెబ్బకి హాలీవుడ్ రేంజ్ మారిపోద్ది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాల వేడిని తగ్గించడానికి ఇప్పుడు బాలయ్య మాస్ యాక్షన్ సీన్ భలేగా ఉపయోగపడిందనే చెప్పాలి.