ఊచకోత వ్యాఖ్యలపై భారతీయుల ఆగ్రహం
పౌరసత్వ సవరణ చట్టం అంతర్గత వ్యవహారమని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రకటించాడు. భారత ప్రభుత్వం కూడా ఇదే పేర్కొంటోంది. కానీ ఈ చట్టం విషయమై పలు ఇస్లాం దేశాలు స్పందిస్తున్నాయి. భారతదేశంలో ముస్లింలపై హింస, ఊచకోత కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ కు చెందిన సుప్రీం లీడర్ భారత్ లో ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లపై స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ట్విటర్ లో భారత్ లో ఊచకోతను ఆపాలని కోరాడు. ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఓ వ్యక్తి మృతదేహం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఏకంగా ఆంగ్లం, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో ఇది ట్వీట్ చేశారు.
తమ దేశంలోని పరిస్థితులపై స్పందించాల్సింది పోయి ఇతర దేశాలపై అక్కసు, ఆగ్రహం ఎందుకని అతడి ట్వీట్ ను చూసిన భారతీయులు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ అధినాయకుడిగా దేశ భద్రత, విదేశాంగ విధానాలపై నిర్ణయం తీసుకునే హక్కు ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ లో ముస్లింల గురించి బాధపడే ముందు తమ దేశం ఇరాన్‌లో ముస్లింలపై జరుగుతున్న ఊచ కోతలపై చర్యలు తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే అలీ ఖమేనీ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా ఇరాన్ తో సత్సంబంధాలు ఉన్నాయి.
అయితే ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యం లో భారత్ లో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటించి సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. ఇదే అక్కసుతో భారత్ పై ఇరాన్ ఆ వ్యాఖ్యలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ అల్లర్ల పై స్పందించారు. కానీ భారతదేశం తీరుపై అసహనం వ్యక్తం చేయక పోయినా అల్లర్ల పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిణామాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Full View Full View