ప్లీజ్ కేసీఆర్.. వారానికి ఒకసారి గాంధీకి వెళ్లండి
అనూహ్యంగా గాంధీ ఆసుపత్రిని సందర్శించి అందరిని విస్మయానికి గురి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఐసీయూ వార్డులో కరోనా రోగులకు అత్యంత సమీపానికి వెళ్లి.. వారి మాటల్ని వినటమే కాదు.. వారికి ధైర్యం చెప్పటం చేశారు. ఐసీయూ లాంటి వార్డుల్లోకి వెళ్లేందుకు పీపీఈ కిట్ ధరించటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం ముఖానికి డబుల్ మాస్కు మాత్రమే ధరించి వెళ్లటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఇంతకాలం గాంధీ ముఖాన్నిచూడని కేసీఆర్.. తాజా పర్యటనతో.. ఇప్పటివరకు వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లైంది. గాంధీకి కేసీఆర్ రావటానికి కాస్త ముందు.. చోటు చేసుకున్నపరిణామాలుకాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. గాంధీకి సీఎం కేసీఆర్ వస్తున్నారన్న విషయాన్ని అధికారుల ద్వారా సమాచారం అందుకున్న గాంధీ అధికారులు.. ఉరుకులు పరుగులు తీసి ఆసుపత్రి మొత్తాన్ని భారీ ఎత్తున శానిటైజ్ చేయించారు. అంతేకాదు.. రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తను యుద్ద ప్రాతిపదికన క్లియర్ చేయటం గమనార్హం.
అప్పటివరకు వార్డుల్లో చెత్త పేరుకు పోయినప్పటికి పట్టించుకోని గాంధీ అధికారులు అందుకు భిన్నంగా.. సీఎం వస్తున్నారన్న వెంటనే వార్డుల్ని పూర్తిగా శుభ్రం చేయటం గమనార్హం. ఇదంతా చూసిన వారు.. రిస్కు అయితే అయ్యింది కానీ.. సీఎం కేసీఆర్ వారానికి ఒకసారి గాంధీకి వస్తే.. రోగులకు అందే సేవల విషయంలో చాలా మెరుగుదల ఉంటుందన్న మాట వినిపిస్తోంది. తాను గాంధీకి వెళితే.. ముందస్తుగా చేసే ఏర్పాట్ల కోసమైనా గాంధీకి తరచూ వెళితే బాగుంటుందంటున్నారు. సారూ.. ఈ ఇష్యూను కాస్త సీరియస్ గా తీసుకోండి.