కాన్ఫరెన్స్: మోడీకి సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి

Update: 2020-08-11 10:50 GMT
దేశంలో కరోనాను అరికట్టడంపై ప్రధానంగా ప్రబలుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.  ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కీలక విజ్ఞప్తులను మోడీకి చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర సహాయ సహకారాలు అందించాలని కోరారు.  పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవని.. భారీగా మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని.. తమకు సాయం చేయాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

ఏపీలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని.. ప్రతీ పదిలక్షల మందికి 47459 పరీక్షలు నిర్వహించామని వివరించారు.  మరణాల రేటు 0.89శాతమేనని మోడీకి విన్నవించారు.

ఏపీలో ప్రతీరోజు 9-10వేల కేులు నమోదవుతున్నాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా చికిత్సలు చేస్తున్నామని జగన్ వివరించారు. ఈ సందర్భంగా మౌళిక సదుపాయాలు లేని ఏపీకి సాయం చేయాలని మోడీని జగన్ కోరారు.
Tags:    

Similar News