బ్రేకింగ్: రేపే బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ

Update: 2020-09-29 17:45 GMT
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం కల్పించనుంది.

మొత్తం 56 కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇక అత్యంత అరుదైన వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ , నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకు కూడా కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

30వేల పైబడి జనాభా ఉన్న వారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నామినెటెడ్ పదవుల్లో పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించనున్నారు.

కార్పొరేషన్ల చైర్మన్లుగా 29మంది మహిళలను, 27మంది పురుషులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అలాగే డైరెక్టర్ పదవుల్లో మహిళలకు 50శాతం ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు చైర్మన్ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
Tags:    

Similar News