ఆ ఇద్ద‌రిపై ఈ ఎదురుదాడి ఏంది బాబు?

Update: 2019-02-14 11:30 GMT
అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్. ఐదేళ్ల నుంచి ఇష్టారాజ్యం పాల‌న‌తో ప్ర‌జ‌ల్లో భారీగా డ్యామేజీని సొంతం చేసుకొని.. గెలుపు కోసం త‌పిస్తున్న చంద్ర‌బాబు య‌వ్వారం చూస్తే..చేత‌లు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంద‌ని చెప్పాలి. అధికారం కోసం ఎన్నిక‌ల వేళ‌లో త‌పించే చంద్ర‌బాబు.. ఒక‌సారి చేతికి ప‌వ‌ర్ వ‌స్తే చాలు ఆయ‌న తీరు మారుతుంద‌ని చెబుతారు. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా పార్టీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ధైర్యం చాల‌ని ఆయ‌న కార‌ణంగా ఏపీలో వ్య‌వ‌స్థ‌లు అధ్వానంగా మారాయ‌ని చెప్పాలి.

అధికార‌ప‌క్షంపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించిన తెలుగు త‌మ్ముళ్లు.. ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నారు. గెలుపు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తున్నారు. నిన్న‌టికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీలో చేరే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌గా.. తాజాగా అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ టీడీపీని విడిచి పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రెఢీ కావ‌టం తెలిసిందే. వ‌రుస‌గా రెండు రోజుల్లో ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ నుంచి జంప్ అయిన  తీరు బాబుకు షాకింగ్ గా మారింది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

మొన్నేచీరాల  ఎమ్మెల్యే ఒకాయ‌న వ‌చ్చి మ‌ళ్లీ పోయాడ‌ని చెప్పిన బాబు.. ఇంకొకాయ‌న ఇక్క‌డ ఎంపీగా ఉండి ఈ రోజు లోట‌స్ పాండ్ కు పోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. మొన్న‌టి వ‌ర‌కూ పార్టీలో ఉండి. .త‌న‌కు విధేయులుగా ఉన్న వారు ఇప్పుడు ఎందుకు పార్టీ నుంచి వీడిపోయార‌న్న విష‌యంపై మాట్లాడ‌కుండా అర్థం లేని మాట‌ల్ని చెప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అధికార‌ప‌క్షానికి చెందిన ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ నుంచి వెళ్లిపోవ‌టం అంటే మాట‌లు కాదు. ప్ర‌జ‌ల్లో పార్టీ గ్రాఫ్ ఎంత‌లా ప‌డిపోయిందో ఈ  ప‌రిణామం చెబుతుంద‌ని చెబుతున్నారు. అందుకేనేమో.. జ‌రిగిన ప‌రిణామాన్ని స‌ర్ది చెప్పుకునేందుకు బాబు ప‌డిన తంటాలు అన్ని ఇన్ని కావు. నాయ‌కులు వెళ్లిపోతుంటే తాను భ‌య‌ప‌డాలా? అని ప్ర‌జ‌ల్ని అడుగుతున్న‌ట్లుగా ప్ర‌శ్నించారు. పార్టీలోకి నేత‌లు రావ‌టం.. జంప్ అవ్వ‌టంతో ప్ర‌జ‌ల‌కు ఏం సంబంధం ఉంది బాబు గారు? ఆ మాట‌కు వ‌స్తే వేరే పార్టీల‌కు చెందిన నేత‌ల్ని ప్యాకేజీ ఇచ్చి మ‌రీ తీసుకొచ్చిన‌ప్పుడు ఏమైనా ప్ర‌జ‌ల్ని ఇదే తీరులో ప్ర‌శ్నించారా ఏంటి?
Tags:    

Similar News