టాప్ క్లీన్ సిటీల్లో ఏపీ టౌన్ కు స్థానం

Update: 2016-07-12 09:41 GMT
దేశంలో అత్యుత్తమ ప్లాన్ సిటీ ఏదన్న ప్రశ్న వేసిన వెంటనే టకీమని ఛండీగఢ్ అని సమాధానం చెప్పేవారు చాలామందే ఉంటారు. అయితే.. ప్లాన్ సిటీ అయినప్పటికి పరిశుభ్రత విషయంలో మాత్రం వరస్ట్ అన్న ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది.  తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సెంటర్ దేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాను విడుదల చేశారు. అత్యంత పరిశుభ్రమైన నగరంగా కేరళలోని అలెప్ప.. గోవా రాజధాని పనాజీ.. కర్ణాటక లోని మైసూరు పరిశుభ్ర నగరాలుగా నివేదిక వెల్లడించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో  ఆంధ్రప్రదేశ్ లోని బొబ్బిలి పట్టణం రెండో స్థానాన్ని ఆక్రమించటం విశేషం.

అదే సమయంలో ఒక మోస్తరు పరిశుభ్రంగా ఉండే టాప్ నాలుగు పట్టణాల్లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన సూర్యాపేట స్థానం దక్కించుకోవటం గమనార్హం. ఘన వ్యర్థాల్ని నిర్వహించే తీరు ఆధారంగా సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ అట్టడుగు స్థానంలో ఉండగా మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవటం గమనార్హం. ఇక.. ప్లాన్ సిటీగా చెప్పే చండీగఢ్ సైతం క్లీన్ సిటీ కానే కాదని.. ఈ నగరమంతా చెత్తతో నిండి ఉంటుందని పేర్కొనటం గమనార్హం.

నివేదిక ప్రకారం నగరాలకు వచ్చిన ర్యాంకింగ్స్ చూస్తే..

పరిశుభ్రమైన టాప్ ఫోర్ పట్టణాలు

1.        అలెప్పా (కేరళ)

2.        బొబ్బిలి (ఆంధ్రప్రదేశ్)

3.        మైసూర్ (కర్ణాటక)

4.        పనాజీ (గోవా)

మధ్యస్తంగా ఉండే పట్టణాలు

1.        అజ్వైల్ (మిజోరం)

2.        పూనే (మహారాష్ట్ర)

3.        సూరత్ (గుజరాత్)

4.        సూర్యాపేట (తెలంగాణ)

అత్యంత చెత్త పట్టణాలు

1.        అగర్తల

2.        బెంగళూరు

3.        చండీగఢ్

4.        ఢిల్లీ

5.        సిమ్లా

Tags:    

Similar News