పెద్దారెడ్డికి క్లాస్ స‌రే.. మ‌రి వీరిమాటేంటి?

Update: 2021-01-06 17:30 GMT
అడుసు తొక్క‌నేల‌.. కాలుక‌డుగ నేల‌.. అనే సామెత వైసీపీలో బ‌లంగా వినిపిస్తోంది. క‌ట్టుత‌ప్పుతున్న నేత ‌ల‌ను దారిలో పెట్ట‌డం పార్టీకి త‌ల‌కు మించిన భారంగా మారుతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది దూకుడు రాజ‌కీయాలు చేస్తున్న విష యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మంత్రులు-ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఎంపీలు-ఎమ్మెల్యేల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసిన భ‌గ్గు మ‌నే ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌కు, వైసీపీ నాయ‌కుల‌కు మ‌ధ్య మ‌రింత తీవ్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఘ‌ట‌నే దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. అయి తే.. ఇదొక్క‌టే కాదు.. గుంటూరు జిల్లా గుర‌జాల‌, తాడికొండ‌, చిల‌క‌లూరిపేట‌, కృష్ణాజిల్లా మైల‌వ‌రం, గుడివాడ‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి, తూర్పుగోదావ‌రిజిల్లా రాజ‌మండ్రి, అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌, పెనుకొండ‌, చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి, న‌గిరి.. ఇలా దాదాపు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌ర్థులు రోడ్డున ప‌డుతున్నారు. వీటిని ఆదిలోనే స‌రిచేయాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లు మాత్రం .. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట విశాఖలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

మ‌రీ ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లోని ప్ర‌తి జిల్లాలోనూ.. ప్ర‌త్య‌ర్థుల‌తో అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ర‌గ‌డకు దిగుతూనే ఉన్నారు. అయితే.. తాడిప‌త్రిలో సాగినంత బ‌రితెగింపు లేక‌పోయినా.. ఈ త‌ర‌హాలోనే రాజ‌కీయా లు సాగుతున్నాయి. వాస్త‌వానికి ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య వైరం ఉంటుంది. కానీ, ఆ వైరం రాజ‌కీయాల‌కే ప‌రిమి తంకావాలి త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు, దౌర్జ‌న్యాల‌కు కూడా దారితీయ‌డం.. వైసీపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లుకు కార‌ణ‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితి ముందుగానే గుర్తించి అదుపు చేయాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అంతా చేతులు దాటిపోయిన త‌ర్వాత‌.. ఫోన్లు చేయ‌డ‌మో.. హెచ్చ‌రించ‌డ‌మో చేయ‌డం ద్వారా.. ఆశించిన ప్ర‌యోజ‌నం మాత్రం ల‌భించ‌డం లేద‌ని వైసీపీ సీనియ‌ర్లే చెబుతున్నారు. ఏదేమైనా.. వైసీపీలో అంత‌ర్గ‌త క‌ట్టుబాటు త‌ప్పుతోంద‌నేదివాస్త‌వం అంటున్నారు.
Tags:    

Similar News