ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్ రాజీపడ్డారా?
ఉప్పు నిప్పుగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ లు రాజీకి వచ్చారని సమాచారం. గొడవలతో వైసీపీలో కాక రేపిన వీరిద్దరూ పరిస్థితులు చేయిదాటిపోతుండడం.. ఆధిపత్య పోరు.. పార్టీ పెద్దల చీవాట్లతో రాజీ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.
వృత్తిరీత్యా వైద్యురాలు అయిన శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున నిలబడి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇసుక విషయంలో తొలుత ఎమ్మెల్యే శ్రీదేవి.. ఎంపీ సురేష్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ మొదలైందని నియోజకవర్గంలో ఓ టాక్ ఉంది.. రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకొని గొడవపడ్డాయి. ఈ క్రమంలోనే పార్టీ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదుర్చినా నియోజకవర్గంలో సెగలు తగ్గలేదు. తాజాగా పేకాట శిబిరంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చిక్కడం.. దీనివెనుక ఎంపీ సురేష్ ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తాయి.
ఇక ఎమ్మెల్యేకు గతంలో ఆర్థికంగా సహకరించిన వ్యక్తి మీడియాకు ఎక్కడం.. సెల్ఫీ వీడియో తీయడం రచ్చ రచ్చ అయ్యింది. దీంతో పార్టీ ముఖ్య అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు శ్రీదేవి రెడీ కావడం వివాదం తీవ్రమైంది.
ఈ క్రమంలోనే ఇక ఎంపీ సురేష్ తో విభేదాలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి రెడీ అయ్యారట.. ఈ మేరకు భర్త, ఇతర కుటుంబ సభ్యులను వెంటపెట్టుకొని ఎంపీ సురేష్ ను కలిసినట్టు సమాచారం. అయితే శ్రీదేవి వ్యవహారంలో మొదట నుంచి గుర్రుగా ఉన్న ఎంపీ సురేష్ మొదట రాజీకీ ససేమిరా అన్నాడని.. నిర్మోహమాటంగా శ్రీదేవి తప్పులను ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. చివరకు బంధువులు అనునయించడంతో మెత్తబడ్డాడని టాక్ బయటకు వచ్చింది.
మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్ లు పాత పగలు అన్నీ మానుకొని.. పరిష్కరించుకొని విభేదాలు మాని పార్టీ కోసం పనిచేయాలని డిసైడ్ అయినట్టు అక్కడ కోడై కూస్తున్నారు.