• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుకి సీఐడీ...

చంద్రబాబుకి సీఐడీ నోటీసులు..23 న విచారణ..ఆ 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం!

By - Tupaki Desk
Update: 2021-03-16 06:00 GMT
ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ‌ సీఐడీ అధికారులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్  కింద నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ - 166 - 167 - 217 - ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977 - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.

అమరావతి భూ కుంభకోణంలో 500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారమే ప్రస్తుతం కీలకంగా మారినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత.. ఏకంగా 500 ఎకరాల అసైన్డ్ భూములను వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. దీన్ని ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ గా నిర్దారించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌ పూలింగ్ ‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ ‌టైమ్‌ సెటిల్‌ మెంట్ లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను - సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ 500 ఎకరాలను కొనుగోలు చేసిన వేర్వేరు వ్యక్తులెవరనేది తేలాల్సి ఉంది. వారంతా చంద్రబాబు బినామీలేననేది అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్లాట్ల కేటాయింపులోనూ వారి పేర్లను చేర్చారనే విమర్శలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఆ కొనుగోలుదారులకు లబ్ది కలిగించేలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, దానికి అనుగుణంగా జీవోలను జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి - వాటిని ల్యాండ్‌ పూలింగ్‌ కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉండటం విశేషం. అసైన్డ్‌ భూములను తక్కువకు కొనుగోలుచేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైనవారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగుచూసింది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదికి రావడం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీలు - మున్సిపాలిటీలు - మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Tags:    
  • CID Notices to Chandrababu 
  • Amaravathi Scam 
  • Amaravathi Land Scam 
  • telugu Desam 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS