హలాల్ చికెన్ అమ్మితే జైలు శిక్ష
చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ దేశంలో ఆహార అలవాట్లలో మత జోక్యం పెరుగుతుండడం గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే చర్యలను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా హలాల్ ఫుడ్ పేరుతో మతాచారాల వ్యాప్తికి ప్రయత్నం జరుగుతోందంటూ కొత్త చట్టాలు తీసుకొస్తోంది. చైనాలో సుమారు 2.5 కోట్ల మంది ముస్లింలు ఉంటారు. ఖురాన్ లో సూచించిన విధంగా ఇస్లాం చట్టం ప్రకారం హలాల్ చేస్తారు. దాన్ని చైనా తప్పు పట్టకపోయినా కొద్దికాలంగా అక్కడ హలాల్ ఫుడ్ పేరుతో సెక్యులర్ లైఫ్ కల్చర్ లోకి మతం చొరబడుతోందని అంటున్నారు. దీన్ని నియంత్రించడానికి చైనా చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.
చైనా సమాజ సహజ లక్షణమైన లౌకికత్వాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇది అక్కడ సామాజిక సమానత్వం - స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. అందుకే హలాల్ అనేది కొన్ని రకాల ఆహారం వరకే పరిమితం చేయాలని ఛాందసంగా వ్యవహరించి దాన్ని మిగతా అన్నిటికీ వర్తింపజేస్తే శిక్షలు తప్పవని నిబంధనలు తెచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం హలాల్ నిబంధనలకు సంబంధం లేని అంశాల్లో చొప్పిస్తే 10 వేల యువాన్ల జరిమానాతో పాటు 5 నుంచి 15 రోజుల జైలు శిక్ష వేసేలా చట్టం చేసింది. చైనాలోని ముస్లింలెవరూ ఇలాంటి జాడ్యాలను అంగీకరించబోరని... విదేశీ జోక్యంతోనే ఇలాంటి ధోరణులు ప్రవేశిస్తున్నాయని చెబుతూ చైనా ముస్లింలు ప్రభుత్వానికి సహకరించాలని అక్కడి ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. అయితే... తాజా పరిణామాలతో చైనాపై ముస్లిం వ్యతిరేక ముద్ర వేస్తున్నారు కొందరు విమర్శకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/