చైనా చతికిలబడింది... తుస్సుమన్న రాకెట్

Update: 2017-07-03 07:59 GMT
చైనా ఎంతో ఆర్భాటంగా తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలు రాయిని చేరుకోవాలని చేసిన ప్రయత్నం తుస్సుమంది.  ఆ దేశం చేపట్టిన అత్యంత భారీ రాకెట్ ప్రయోగం ఫెయిలైంది.
    
‘లాంగ్ మార్చ్-5 వై2’ పేరుతో ఆదివారం చేపట్టిన ప్రయోగం చైనాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. చైనా స్పేస్ ప్రోగ్రాంలో ఇది కోలుకోలేని దెబ్బ. ముఖ్యంగా అంతర్జాతీయంగా రక్షణ, స్పేస్ రంగాల్లో అంతా దూసుకుపోతున్న తరుణంలో.. ఈ రంగాలు బలాబలాల ప్రదర్శనకు వేదికవుతున్న సమయంలో ఇంత దారుణంగా దెబ్బతినడం ఆ దేశ సామర్థ్యాలపై నమ్మకం పోయేలా చేసింది.
    
గతేడాది వెన్‌చాంగ్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-5 ప్రయోగం విజయవంతం కావడంతో చైనా ఈ ప్రయోగంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇది సక్సెస్ చేసి ప్రపంచానికి తమ సత్తా చాటాలనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే వేదిక నుంచి లాంగ్ మార్చ్-5వై2ను ప్రయోగించినా భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో అది విఫలమైంది.
    
లాంగ్ మార్చ్-5వై2 రాకెట్ బరువు 879 టన్నులు. 25 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టే సామర్థ్యం దీని సొంతం. అయితే తాజా ప్రయోగంలో మాత్రం అది మోసుకెళ్లిన 7.5 టన్నుల బరువైన షిజియాన్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. ఇప్పటి వరకు చైనా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News