• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి నాదెండ్ల కోట‌లో...

మంత్రి నాదెండ్ల కోట‌లో రాజ‌కీయం ఎలా ఉంది..?

| తెనాలి నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజకీయాల్లో జోరు క‌నిపిస్తోంది.

By - Garuda Media
Update: 2026-09-25 09:30 GMT

తెనాలి నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజకీయాల్లో జోరు క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో వైసీపీలో నాయ‌కుల లేమి, మాజీ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుల వ్య‌వ‌హారం బేజారుగా మారింది. గతంలో కేవలం తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్యే సాగిన ప్రధాన పోటీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ రంగ ప్రవేశంతో త్రిముఖ పోరుగా మారి, చివరకు కూటమి విజయం సాధించింది.

ప్రస్తుతం తెనాలి టౌన్, తెనాలి రూరల్, కొల్లిపర మండలాల పరిధిలో తాజా రాజకీయ సమీకరణాలు మారుతున్నా యి. ఇవి కూట‌మికి అనుకూలంగా ఉన్నాయి. కూటమి నేత‌, మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో శ్రేణులు జోరుమీదున్నారు. మనోహర్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నిరంతరం పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో నియోజకవర్గ పరిధిలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి, రహదారుల నిర్మాణాలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ మౌలిక వసతుల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ స్థానిక నేతలు, జనసేన శ్రేణులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కేంద్ర కార్యాల‌యం చేరువ‌గానే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఇతర ముఖ్య నాయకులు నియోజకవర్గంలో కార్య‌క్ర‌మాల‌కు ముక్త‌స‌రిగా హాజ‌రవుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలాల వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులు అలర్ట్ అవుతున్నారు. వార్డులు, గ్రామాల పరిధిలో పట్టు నిలుపుకోవడానికి అధికార కూటమి అంతర్గత వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ మాత్రం తిరిగి పుంజుకోవడానికే ప‌రిమితం అవుతోంది. మొత్తంగా చూస్తే, తెనాలి టౌన్, రూరల్ మండలాల పరిధిలో ప్రస్తుతం అధికార పక్షం అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తుండగా, ప్రతిపక్షం మాత్రం కేడర్‌పై వస్తున్న కేసులను ఎదుర్కొంటూ రాజకీయ ఉనికి కోసం ప్ర‌యాస ప‌డుతోంది.

Tags:    
  • tenali 
  • nadendlamanohar 
  • janasena 
  • ysrcp 
  • andhrapolitics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS