చైనా నిండా ముసలోల్లే... బెడిసి కొట్టిన జనాభా నియంత్రణ

Update: 2021-02-14 14:30 GMT
జనాభా నియంత్రణ చైనా కొంపముంచింది. ఇప్పుడు ఆ దేశంలో వృద్ధులు ఎక్కువయ్యారు. దీంతో ప్రభుత్వం జనాభా నియంత్రణ నిబంధనలను సడలించింది. పిల్లల్ని కనండి బాబూ.. అని మొత్తుకుంటున్నది. చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో 1970 లో వన్​ చైల్డ్​  ‘ఒక పాప ముద్దు’ పాలసీని తీసుకొచ్చింది. దీంతో అందరూ ఒక్కరినే కనడంతో ఆ దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు. ఇలా అనడం కంటే యువకుల సంఖ్య తగ్గిపోయిందని అని చెప్పవచ్చు.

 ఏ  దేశానికైనా బాలలే పట్టుకొమ్మలు.. అయితే చైనా విధానంతో పిల్లలు పుట్టడం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆ దేశంలో వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే 2016లో  చైనా నిబంధనలను కొంత మేర సడలించింది. ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిచ్చింది. అయినప్పటికీ ఆ దేశ ప్రజలు పెద్దగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు ఇద్దరు పిల్లలను కనాలంటూ ఆ దేశం మొత్తుకుంటున్నది.

2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు నమోదయ్యాయి. 2019 సంవత్సరంతో పోలిస్తే జననాల సంఖ్య 30 శాతానికి పడిపోయింది.  పిల్లలను కనేవాళ్లకు ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇస్తున్నారు. అయితే ఒక్కరిని మాత్రమే కనేందుకు ఆ దేశంలోని చాలా మంది మానసికంగా సిద్ధపడ్డారు.  ఇద్దరు పిల్లలను కనడం లేదు. అంతేకాక చైనాలో జీవన వ్యయం కూడా పెరిగిపోయింది.  యువకులు లేకపోవడం.. దేశానికి ఎంతో ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తున్నది.
Tags:    

Similar News